ఈ రీతి వేరొకతైతే ఇద్దరిని వింతసేసు
(॥పల్లవి॥)
ఈ రీతి వేరొకతైతే ఇద్దరిని వింతసేసు
సైరణతో నున్నదెంత సాదో కాని
(॥ఈరీ॥)
పువ్వుల నాపెను నీవు పూఁచివేయఁగాఁ జూచి
నివ్వెరగుతో నీకె నిలుచున్నది
యెవ్వరి నేమీ ననదు యెగసక్కెములాడదు
జవ్వని తానికి యెంతసాదోకాని
(॥ఈరీ॥)
వనితపై నీవు గడువసంతమాడఁగఁ జూచి
తనలోనే తాను చింతతో నున్నది
కనలి కోపించదు కాతరాన నలుగదు
చనవుమెరసీ నెంతసాదోకాని
(॥ఈరీ॥)
పట్టపుదేవులు నీవు బైకొని కూడఁగాఁ జూచి
గట్టిగాఁ గాఁగిట నిన్నుఁ గలశున్నది
యిట్టె శ్రీవేంకటేశ యేమీ నిన్నుఁ దడవదు
జట్టిగొని మొక్కీ నెంతసాదోకాని
(||pallavi||)
ī rīdi verŏgadaide iddarini viṁtasesu
sairaṇado nunnadĕṁta sādo kāni
(||īrī||)
puvvula nābĕnu nīvu pūm̐siveyam̐gām̐ jūsi
nivvĕragudo nīgĕ nilusunnadi
yĕvvari nemī nanadu yĕgasakkĕmulāḍadu
javvani tānigi yĕṁtasādogāni
(||īrī||)
vanidabai nīvu gaḍuvasaṁtamāḍam̐gam̐ jūsi
tanalone tānu siṁtado nunnadi
kanali kobiṁchadu kādarāna nalugadu
sanavumĕrasī nĕṁtasādogāni
(||īrī||)
paṭṭabudevulu nīvu baigŏni kūḍam̐gām̐ jūsi
gaṭṭigām̐ gām̐giḍa ninnum̐ galaśhunnadi
yiṭṭĕ śhrīveṁkaḍeśha yemī ninnum̐ daḍavadu
jaṭṭigŏni mŏkkī nĕṁtasādogāni