Ee reedi raamumdu krshnudu yashoda yeduda numdi

ఈ రీతి రాముఁడు కృష్ణుడు యశోద యెదుట నుండి
Language

(॥పల్లవి॥)
ఈ రీతి రాముఁడు కృష్ణుడు యశోద యెదుట నుండి
కోరి ముద్దు గునియంగ కొమ్మలు నవ్వేరు

(॥ఈరీతి॥)
పానిపట్టి వుమిసెనే పాలలోన గృష్ణుడు
నేనా రాము డుమిసెఁ దానే కాక
కానఁగానే యింత చేసి కల్లలాడేఁ జూడవే
ఆనవెట్టు మనవే తా నది నిజమనుచు

(॥ఈరీతి॥)
సారెఁ బిల్లఁ దీపు లాడి లాడి జారిపడెఁ గృష్ణుడు
వూరకే గడించ నేల వో యమ్మ తాను
వూరివారి నడుగవే వుద్దాండాలు వీనిని
యీరీతి నాపై గడించి యిన్నియుఁ దాఁ జేసెను

(॥ఈరీతి॥)
వెంటనే విని ద్దులు వెళ్లవేతు నటనే
వొంటి నన్ను వెఱపించె వుదుటై తాను
దంటనై శ్రీవేంకటాద్రి తాను నే నాడితి మమ్ము
నింటఁ బొత్తు గలుపేవు యిద్దరము నొకటే

(||pallavi||)
ī rīdi rāmum̐ḍu kṛṣhṇuḍu yaśhoda yĕduḍa nuṁḍi
kori muddu guniyaṁga kŏmmalu navveru

(||īrīdi||)
pānibaṭṭi vumisĕne pālalona gṛṣhṇuḍu
nenā rāmu ḍumisĕm̐ dāne kāga
kānam̐gāne yiṁta sesi kallalāḍem̐ jūḍave
ānavĕṭṭu manave tā nadi nijamanusu

(||īrīdi||)
sārĕm̐ billam̐ dību lāḍi lāḍi jāribaḍĕm̐ gṛṣhṇuḍu
vūrage gaḍiṁcha nela vo yamma tānu
vūrivāri naḍugave vuddāṁḍālu vīnini
yīrīdi nābai gaḍiṁchi yinniyum̐ dām̐ jesĕnu

(||īrīdi||)
vĕṁṭane vini ddulu vĕḽlavedu naḍane
vŏṁṭi nannu vĕṟabiṁchĕ vuduḍai tānu
daṁṭanai śhrīveṁkaḍādri tānu ne nāḍidi mammu
niṁṭam̐ bŏttu galubevu yiddaramu nŏgaḍe