ఈ పాటి మేలు సేసితి వింత చాలదా
(॥పల్లవి॥)
ఈ పాటి మేలు సేసితి వింత చాలదా
మా పట్టుకు నీవు గాఁగా మన్నించితి గాకా
(॥ఈపాటి॥)
వంతుకు నామనసు రావలె నంటా నాపెచేత
పంతము లిప్పించే వేర పలుమారు
యెంతటివాఁడవు నీవు యే మేమి సేయ నేరవు
మంతనానా మముఁ గొంత మన్నించితి గాకా
(॥ఈపాటి॥)
ఆది గొని నేనే మైనా ననే నంటా నాపె చేత
పాదాలకు మొక్కించేవు పలుమారు
కా దంటే నీ వెంత కైనఁ గలవు నే నెరఁగనా
మాదెసఁ గొంత నీవు మన్నించితి గాకా
(॥ఈపాటి॥)
యెనయ నిద్దరి నొకయింటఁ బెట్టి యాపెచేత
పని నాకుఁ జేయించేవు పలుమారు
కొనబు శ్రీవెంకటేశ కూడితిని నన్ను నిట్టె
మన సిచ్చి నేఁ గాఁగా మన్నించితి గాకా
(||pallavi||)
ī pāḍi melu sesidi viṁta sāladā
mā paṭṭugu nīvu gām̐gā manniṁchidi gāgā
(||ībāḍi||)
vaṁtugu nāmanasu rāvalĕ naṁṭā nābĕseda
paṁtamu lippiṁche vera palumāru
yĕṁtaḍivām̐ḍavu nīvu ye memi seya neravu
maṁtanānā mamum̐ gŏṁta manniṁchidi gāgā
(||ībāḍi||)
ādi gŏni nene mainā nane naṁṭā nābĕ seda
pādālagu mŏkkiṁchevu palumāru
kā daṁṭe nī vĕṁta kainam̐ galavu ne nĕram̐ganā
mādĕsam̐ gŏṁta nīvu manniṁchidi gāgā
(||ībāḍi||)
yĕnaya niddari nŏgayiṁṭam̐ bĕṭṭi yābĕseda
pani nāgum̐ jeyiṁchevu palumāru
kŏnabu śhrīvĕṁkaḍeśha kūḍidini nannu niṭṭĕ
mana sichchi nem̐ gām̐gā manniṁchidi gāgā