Ee paada sukhamoo yilaloni jeevunigi

ఈ పాట సుఖమూ యిలలోని జీవునికి
Language

(॥పల్లవి॥)
ఈ పాట సుఖమూ యిలలోని జీవునికి
చేపట్టి యింత సేసిన శ్రీపతి నెఱుఁగఁడు

(॥ఈపాటి॥)
నిరతిఁ గట్టివేసినవాని విడిచి మోపెత్తితే
పరువువారి సంతోషపడినయట్లు
దరిద్రుఁడయినవాని తగు రాజుఁగాఁ జేసితే
మురిసి వేడుకె కాని ముందర యెఱుఁగడు

(॥ఈపాటి॥)
గుండు మోచేయట్టివాని గొప్ప యేఁత మెత్తించితే
అందనే పాడుచు నలపార్చుకొన్నట్లు
పండని తపసిఁ దెచ్చి బలుసంసారిఁ జేసితే
దండితనమే కాని యందలి పాట్లెంచఁడు

(॥ఈపాటి॥)
పట్టి దున్నేయెద్దుఁ దెచ్చి బంతి గట్టి నురిపితే
నట్టే గవుక మేసి మల్లాడినయట్లు
గట్టిగా శ్రీవేంకటేశ కష్టునిఁ బుణ్యుఁ జేసితే
వట్టియహంకారియై యెవ్వరినిఁ గైకొనఁడు

(||pallavi||)
ī pāḍa sukhamū yilaloni jīvunigi
sebaṭṭi yiṁta sesina śhrībadi nĕṟum̐gam̐ḍu

(||ībāḍi||)
niradim̐ gaṭṭivesinavāni viḍisi mobĕttide
paruvuvāri saṁtoṣhabaḍinayaṭlu
daridrum̐ḍayinavāni tagu rājum̐gām̐ jeside
murisi veḍugĕ kāni muṁdara yĕṟum̐gaḍu

(||ībāḍi||)
guṁḍu moseyaṭṭivāni gŏppa yem̐ta mĕttiṁchide
aṁdane pāḍusu nalabārsugŏnnaṭlu
paṁḍani tabasim̐ dĕchchi balusaṁsārim̐ jeside
daṁḍidaname kāni yaṁdali pāṭlĕṁcham̐ḍu

(||ībāḍi||)
paṭṭi dunneyĕddum̐ dĕchchi baṁti gaṭṭi nuribide
naṭṭe gavuga mesi mallāḍinayaṭlu
gaṭṭigā śhrīveṁkaḍeśha kaṣhṭunim̐ buṇyum̐ jeside
vaṭṭiyahaṁkāriyai yĕvvarinim̐ gaigŏnam̐ḍu