Ee melu dalamsugo yeppudunu neemadilo

ఈ మేలు దలఁచుకో యెప్పుడును నీమతిలో
Language

(॥పల్లవి॥)
ఈ మేలు దలఁచుకో యెప్పుడును నీమతిలో
సాములు సేసి నీతో చలము నెరపదా

(॥ఈమే॥)
కొంతగొంత నాచెక్కు గోర నీవు గీరితేను
పంతములాడితినా పదరితినా
రంతుల వేరొకతైతే రవ్వనేసి నీమేను
యెంతైనా నొకటికి యినుమడిసేయదా

(॥ఈమే॥)
పలుమారు నామోవిపై పలుసోఁకులు నించితే
బలిమిసేసితినా పదరితినా
వెలయ వేరొకతైతే వింతలుగా విన్నప్పటి
యెలయించి వొకటికి యినుమడి సేయదా

(॥ఈమే॥)
చందపుశ్రీవేంకటేశ చన్నులొత్తి కూడితివి
పందెములు గొంటినా పదరితినా
విందులవేరొకతైతే వేసాలెల్లాఁ జూపి
యిందరిలో వొకటికి యినుమడిసేయదా

(||pallavi||)
ī melu dalam̐sugo yĕppuḍunu nīmadilo
sāmulu sesi nīdo salamu nĕrabadā

(||īme||)
kŏṁtagŏṁta nāsĕkku gora nīvu gīridenu
paṁtamulāḍidinā padaridinā
raṁtula verŏgadaide ravvanesi nīmenu
yĕṁtainā nŏgaḍigi yinumaḍiseyadā

(||īme||)
palumāru nāmovibai palusom̐kulu niṁchide
balimisesidinā padaridinā
vĕlaya verŏgadaide viṁtalugā vinnappaḍi
yĕlayiṁchi vŏgaḍigi yinumaḍi seyadā

(||īme||)
saṁdabuśhrīveṁkaḍeśha sannulŏtti kūḍidivi
paṁdĕmulu gŏṁṭinā padaridinā
viṁdulaverŏgadaide vesālĕllām̐ jūbi
yiṁdarilo vŏgaḍigi yinumaḍiseyadā