ఈ మాటకేమి నాకిందరిలో వెరగయ్యీ
(॥పల్లవి॥)
ఈ మాటకేమి నాకిందరిలో వెరగయ్యీ
నా మాట వినకున్న నాకు సిగ్గుగాదా
(॥ఈవ॥)
మన్నించి చేపట్టఁగా నే మాటలాడేఁ గాని నీతో
సన్నతోనే మెలఁగితే చక్కనుండనా
వున్నతి యెక్కువ సేసి వూరివారి వలెనే
నన్ను సరిగాఁ జూచితే నాకు సిగ్గుగాదా
(॥ఈవ॥)
కమ్మటి నీవు నవ్వఁగఁ గదియ వచ్చితిఁ గాని
యెమ్మెల నీ వూరకున్న నింటనుండనా
సమ్మతించఁ జేసి నాకె సారెఁ గపటములైతే
నమ్మవని నిన్నునాడ నాకు సిగ్గుగాదా
(॥ఈవ॥)
కలయ వేఁడుకోఁగానే కానిమ్మంటిఁగాని నీతో
చలమున నూరకున్న సమ్మతించేనా
మెలఁగి శ్రీవేంకటేశ మించ నన్నుఁ గూడితివి
నలినింతలేకున్న నాకు సిగ్గుగాదా
(||pallavi||)
ī māḍagemi nāgiṁdarilo vĕragayyī
nā māḍa vinagunna nāgu siggugādā
(||īva||)
manniṁchi sebaṭṭam̐gā ne māḍalāḍem̐ gāni nīdo
sannadone mĕlam̐gide sakkanuṁḍanā
vunnadi yĕkkuva sesi vūrivāri valĕne
nannu sarigām̐ jūside nāgu siggugādā
(||īva||)
kammaḍi nīvu navvam̐gam̐ gadiya vachchidim̐ gāni
yĕmmĕla nī vūragunna niṁṭanuṁḍanā
sammadiṁcham̐ jesi nāgĕ sārĕm̐ gabaḍamulaide
nammavani ninnunāḍa nāgu siggugādā
(||īva||)
kalaya vem̐ḍugom̐gāne kānimmaṁṭim̐gāni nīdo
salamuna nūragunna sammadiṁchenā
mĕlam̐gi śhrīveṁkaḍeśha miṁcha nannum̐ gūḍidivi
naliniṁtalegunna nāgu siggugādā