ఈ కోపా లీతాపా లిట్టె వుండీనా
(॥పల్లవి॥)
ఈ కోపా లీతాపా లిట్టె వుండీనా
సాకిరి నేఁ దెలిపేఁగా సాదించేదానిని
(॥ఈకోపా॥)
ఆతఁ డీడకు రాఁగానె ఆన వెట్టుకొందు గాక
కాతరానఁ జెప్పి పంపఁ గారణ మేమే
యీతల నీ రమణుఁడు యెదుట నిలిచితేను
చూతము వో యిట్లనె సొలసెటిదానిని
(॥ఈకోపా॥)
వోడక నిన్ను రమ్మంటే నొల్ల నందు వింతే కాక
ఆడ నుండఁగానె లేక లంప నేఁటికే
కూడనివారే తమిఁ గూడేరు యిప్పు డెట్టె
తోడనె పంగించేఁ బో తొలఁగెటిదానిని
(॥ఈకోపా॥)
పెల్లున నీ వొద్దికె పిలిపించు కొందు గాక
యిల్లురికి వచ్చి వాదు లివి యేఁటికే
వొల్లనె శ్రీ వేంకటేశు డొద్దికతో నిన్నుఁ గూడె
పల్లదాన నవ్వేఁ బో పాసియుండేదానిని
(||pallavi||)
ī kobā līdābā liṭṭĕ vuṁḍīnā
sāgiri nem̐ dĕlibem̐gā sādiṁchedānini
(||īgobā||)
ādam̐ ḍīḍagu rām̐gānĕ āna vĕṭṭugŏṁdu gāga
kādarānam̐ jĕppi paṁpam̐ gāraṇa meme
yīdala nī ramaṇum̐ḍu yĕduḍa nilisidenu
sūdamu vo yiṭlanĕ sŏlasĕḍidānini
(||īgobā||)
voḍaga ninnu rammaṁṭe nŏlla naṁdu viṁte kāga
āḍa nuṁḍam̐gānĕ lega laṁpa nem̐ṭige
kūḍanivāre tamim̐ gūḍeru yippu ḍĕṭṭĕ
toḍanĕ paṁgiṁchem̐ bo tŏlam̐gĕḍidānini
(||īgobā||)
pĕlluna nī vŏddigĕ pilibiṁchu kŏṁdu gāga
yillurigi vachchi vādu livi yem̐ṭige
vŏllanĕ śhrī veṁkaḍeśhu ḍŏddigado ninnum̐ gūḍĕ
palladāna navvem̐ bo pāsiyuṁḍedānini