ఈ గుణాలు మీకె కల విద్దరికిని
(॥పల్లవి॥)
ఈ గుణాలు మీకె కల విద్దరికిని
చేగదేరఁ బొగడేరు చెలులెల్లా మిమ్మును
(॥॥)
యెగసక్కేలకు బతి యేమేమి సేసినాను
వొగరులాడక వూరకున్నదే సతి
సొగసేయాఁటది యెంత సోఁక సరసమాడినా
వెగటులేకున్న యట్టివిభుఁడే జాణఁడు
(॥॥)
అవల రమణుఁ డెంత యగ్గలికఁ దిరిగినా
చవి సేసుకుండేది సకియ
జవరాలు తను నెంతచలము సాదించినాను
అవుఁగాదననివాఁడే అందపురమణుఁడు
(॥॥)
కమ్ముకొని ప్రియుఁడెంత కాఁగిట నలయించినా
సమ్మతించి వుండేది అచ్చపుదేవులు
నెమ్మి శ్రీ వేంకటేశ నెలఁత రతి మించినా
నెమ్మది మన్నించితిటు నీవే నాయకుఁడవు
(||pallavi||)
ī guṇālu mīgĕ kala viddarigini
segaderam̐ bŏgaḍeru sĕlulĕllā mimmunu
(||||)
yĕgasakkelagu badi yememi sesinānu
vŏgarulāḍaga vūragunnade sadi
sŏgaseyām̐ṭadi yĕṁta som̐ka sarasamāḍinā
vĕgaḍulegunna yaṭṭivibhum̐ḍe jāṇam̐ḍu
(||||)
avala ramaṇum̐ ḍĕṁta yaggaligam̐ diriginā
savi sesuguṁḍedi sagiya
javarālu tanu nĕṁtasalamu sādiṁchinānu
avum̐gādananivām̐ḍe aṁdaburamaṇum̐ḍu
(||||)
kammugŏni priyum̐ḍĕṁta kām̐giḍa nalayiṁchinā
sammadiṁchi vuṁḍedi achchabudevulu
nĕmmi śhrī veṁkaḍeśha nĕlam̐ta radi miṁchinā
nĕmmadi manniṁchidiḍu nīve nāyagum̐ḍavu