ఈ దేవదేవునికి నిందిరారమణునికి
(॥పల్లవి॥)
ఈ దేవదేవునికి నిందిరారమణునికి
సాదించినటువలె సర్వమూ నమరే
(॥ఈడే॥)
అడరి రామునికిఁ బట్టాభిషేకమైనట్టు
కడలేని పన్నీటికా నమరెను
పొడవై యందె సురలు పుష్పవృష్టి నించినట్టు
కడుఁ గడుఁ గర్పూరకా పమరెను
(॥ఈడే॥)
పాలజలధిపై నీలిపట్టు నిండాఁ గప్పినట్టు
కాళిమతోడ పులుగుకా పమరెను
కేలినందు పసిఁడితీఁగెలు నిండఁ బాఁకినట్టు
సోలిఁ బెట్టినటువంటి సొమ్ములు నమరెను
(॥ఈడే॥)
చంచుల శ్రీవేంకటేశు జంట పెనఁ బెట్టినట్టు
యెంచ నలమేలుమంగ యెద నమరె
అంచెల జవ్వనవనా లట్టే వికసించినటు
పొంచి ఇద్దరిమేనుల పువ్వుదండ లమరెను
(||pallavi||)
ī devadevunigi niṁdirāramaṇunigi
sādiṁchinaḍuvalĕ sarvamū namare
(||īḍe||)
aḍari rāmunigim̐ baṭṭābhiṣhegamainaṭṭu
kaḍaleni pannīḍigā namarĕnu
pŏḍavai yaṁdĕ suralu puṣhpavṛṣhṭi niṁchinaṭṭu
kaḍum̐ gaḍum̐ garbūragā pamarĕnu
(||īḍe||)
pālajaladhibai nīlibaṭṭu niṁḍām̐ gappinaṭṭu
kāḽimadoḍa pulugugā pamarĕnu
kelinaṁdu pasim̐ḍidīm̐gĕlu niṁḍam̐ bām̐kinaṭṭu
solim̐ bĕṭṭinaḍuvaṁṭi sŏmmulu namarĕnu
(||īḍe||)
saṁchula śhrīveṁkaḍeśhu jaṁṭa pĕnam̐ bĕṭṭinaṭṭu
yĕṁcha nalamelumaṁga yĕda namarĕ
aṁchĕla javvanavanā laṭṭe vigasiṁchinaḍu
pŏṁchi iddarimenula puvvudaṁḍa lamarĕnu