Ee dehigi nimkaanu

ఈ దేహికి నింకాను
Language

(॥పల్లవి॥)
ఈ దేహికి నింకాను
సాదించిన సకలము జయము

(॥ఈదే॥)
ఏది తుద యెన్నఁడు ముగుసును
ఆదికి ననాది హరిమాయ
సాదించి సుజ్ఞాని యైతే
యీదెస వెదకిన యిహమే పరమూ

(॥ఈదే॥)
బలిమేది భవములఁ బాయఁగ
కలిగి నట్లెల్లాఁ గర్మంబు
నిలుకడలో నిర్మలుఁడైతే
వలసిన చోటనే వాఁడికి సుఖము

(॥ఈదే॥)
తని వేది తగుభోగములకు
తనలోపలనే దైవికము
చనవుననూ శరణు చొచ్చితే
వెనుకొనె నిదె శ్రీ వేంకట విభుఁడు

(||pallavi||)
ī dehigi niṁkānu
sādiṁchina sagalamu jayamu

(||īde||)
edi tuda yĕnnam̐ḍu mugusunu
ādigi nanādi harimāya
sādiṁchi sujñāni yaide
yīdĕsa vĕdagina yihame paramū

(||īde||)
balimedi bhavamulam̐ bāyam̐ga
kaligi naṭlĕllām̐ garmaṁbu
nilugaḍalo nirmalum̐ḍaide
valasina soḍane vām̐ḍigi sukhamu

(||īde||)
tani vedi tagubhogamulagu
tanalobalane daivigamu
sanavunanū śharaṇu sŏchchide
vĕnugŏnĕ nidĕ śhrī veṁkaḍa vibhum̐ḍu