ఈ దేహవికారమునకు నేదియుఁ గడపల గానము
(॥పల్లవి॥)
ఈ దేహవికారమునకు నేదియుఁ గడపల గానము
మోదమెరంగని మోహము ముందర గననీదు
(॥ఈదే॥)
నిత్యానిత్యవివేకము నీరసునకు నొనగూడదు
సత్యాలాపవిచారము జరగదు లోభికిని
హత్యావిరహితకర్మము అంటదు క్రూరాత్మునకును
ప్రత్యక్షంబగుపాపము పాయదు కష్టునకు
(॥ఈదే॥)
సతతానందవికాసము సంధించదు తామసునకు
గతకల్మషభావము దొరకదు వ్యసనికిని
జితకాముఁడు దా నవుటకు సిద్ధింపదు దుష్కర్మికి
అతులితగంభీరగుణం బలవడ దధమునకు
(॥ఈదే॥)
శ్రీవేంకటగిరివల్లభు సేవా తాత్పరభావము -
ద్రోవ మహలంపటులకు తోఁపదు తలఁపునకు
దేవోత్తముఁగడు నీతని దివ్యామృతమగు నామము
సేవింపఁగ నితరులకును చిత్తం బొడఁబడదు
(||pallavi||)
ī dehavigāramunagu nediyum̐ gaḍabala gānamu
modamĕraṁgani mohamu muṁdara gananīdu
(||īde||)
nityānityavivegamu nīrasunagu nŏnagūḍadu
satyālābavisāramu jaragadu lobhigini
hatyāvirahidagarmamu aṁṭadu krūrātmunagunu
pratyakṣhaṁbagubābamu pāyadu kaṣhṭunagu
(||īde||)
sadadānaṁdavigāsamu saṁdhiṁchadu tāmasunagu
gadagalmaṣhabhāvamu dŏragadu vyasanigini
jidagāmum̐ḍu dā navuḍagu siddhiṁpadu duṣhkarmigi
adulidagaṁbhīraguṇaṁ balavaḍa dadhamunagu
(||īde||)
śhrīveṁkaḍagirivallabhu sevā tātparabhāvamu -
drova mahalaṁpaḍulagu tom̐padu talam̐punagu
devottamum̐gaḍu nīdani divyāmṛtamagu nāmamu
seviṁpam̐ga nidarulagunu sittaṁ bŏḍam̐baḍadu