ఎటువంటివాఁడవు యేమి జాణతనము
(॥పల్లవి॥)
ఎటువంటివాఁడవు యేమి జాణతనము
నటనఁ గేఁకరించుకొనఁగరాదా నేను
(॥॥)
అగపడి యింతులు నీయండ నిలుచుండఁగా
నగరాదా నిన్నుఁ జూచి నాకు నేఁడు
తగవు చెప్పు మనుచు తామే సాకిరి గోరఁగ
మొగము చూచి నీకు మొక్కరాదా నేను
(॥॥)
చేతులకొలఁది నీపై సేసలెల్లా బెట్టఁగాను
యీతల మెచ్చఁగరాదా ఇంతలో నాకు
రాతిరీఁ బగలు జాగరాలు నిన్నుఁ జేయించఁగా
ఘాతల జూడగఁరాదా కందువతో నేను
(॥॥)
వొట్టుకొని నిన్నుఁ గూడి వూడిగాలు సేయఁగాను
దట్టముగ ఱట్టుసేయఁ దగదా నాకు
ఇట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
చుట్టిమనై ఆనందానఁ జొక్కరాదా నేను
(||pallavi||)
ĕḍuvaṁṭivām̐ḍavu yemi jāṇadanamu
naḍanam̐ gem̐kariṁchugŏnam̐garādā nenu
(||||)
agabaḍi yiṁtulu nīyaṁḍa nilusuṁḍam̐gā
nagarādā ninnum̐ jūsi nāgu nem̐ḍu
tagavu sĕppu manusu tāme sāgiri goram̐ga
mŏgamu sūsi nīgu mŏkkarādā nenu
(||||)
sedulagŏlam̐di nībai sesalĕllā bĕṭṭam̐gānu
yīdala mĕchcham̐garādā iṁtalo nāgu
rādirīm̐ bagalu jāgarālu ninnum̐ jeyiṁcham̐gā
ghādala jūḍagam̐rādā kaṁduvado nenu
(||||)
vŏṭṭugŏni ninnum̐ gūḍi vūḍigālu seyam̐gānu
daṭṭamuga ṟaṭṭuseyam̐ dagadā nāgu
iṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭe
suṭṭimanai ānaṁdānam̐ jŏkkarādā nenu