Eduvamtivaamdavayyaa yeṟamgavaa neevemainaa

ఎటువంటివాఁడవయ్యా యెఱఁగవా నీవేమైనా
Language

(॥పల్లవి॥)
ఎటువంటివాఁడవయ్యా యెఱఁగవా నీవేమైనా
సటకానివలెనే సన్నలు సేతురా

(॥ఎటు॥)
జవ్వనభారముచేత జడిసేటికోమలినీ
రవ్వలు సేతురా రాదంటాను
నవ్వుచు సంతసముతో నగరిలో నుండఁగాను
పవ్వళించి నీవీడఁ బంతములాడుదురా

(॥ఎటు॥)
నిచ్చలపువలపున నివ్వెరగుతో నుండఁగా
పచ్చిగాఁ దిట్టుదురా పలుకదంటా
మచ్చికమగువలతోమాటలాడుచుండఁగాను
అచ్చముగా నీవువచ్చి అయము లంటుదురా

(॥ఎటు॥)
కలసి తమకమునఁ గరఁగుచునుండఁగాను
ములుగోరు నాటింతురా మొక్కదంటాను
అలరి శ్రీవేంకటేశ అన్నిటా నేలుకొంటివి
వెలలేనిరతులను వేసాలుసేతురా

(||pallavi||)
ĕḍuvaṁṭivām̐ḍavayyā yĕṟam̐gavā nīvemainā
saḍagānivalĕne sannalu sedurā

(||ĕḍu||)
javvanabhāramuseda jaḍiseḍigomalinī
ravvalu sedurā rādaṁṭānu
navvusu saṁtasamudo nagarilo nuṁḍam̐gānu
pavvaḽiṁchi nīvīḍam̐ baṁtamulāḍudurā

(||ĕḍu||)
nichchalabuvalabuna nivvĕragudo nuṁḍam̐gā
pachchigām̐ diṭṭudurā palugadaṁṭā
machchigamaguvaladomāḍalāḍusuṁḍam̐gānu
achchamugā nīvuvachchi ayamu laṁṭudurā

(||ĕḍu||)
kalasi tamagamunam̐ garam̐gusunuṁḍam̐gānu
mulugoru nāḍiṁturā mŏkkadaṁṭānu
alari śhrīveṁkaḍeśha anniḍā nelugŏṁṭivi
vĕlaleniradulanu vesālusedurā