ఎటువంటివాఁడవయ్యా యేమయ్యా నీవు
(॥పల్లవి॥)
ఎటువంటివాఁడవయ్యా యేమయ్యా నీవు
తటుకన నిఁక దయదలఁచుకోవయ్యా
(॥ఎటు॥)
యెడమాట లాడించి ఇంతితోఁ బొందులు సేసి
తడవవు తాఁకవు తగవా నీకు
అడియాలా లెల్లాఁ జెప్పి ఆసలాసలఁ బెట్టి
వెడవెడగా నవ్వేవు వేడుకా నీకు
(॥ఎటు॥)
సన్నలు సారెకుఁజేసి చవు లీపెకుఁ బుట్టించి
పన్నుగ జూజూలాడేవు పంతమా నీకు
యెన్నికగాఁ బెండ్లాడి ఇక్కువలు గరఁగించి
వున్నాఁడ వెఱఁగనట్టే వుచితమా నీకు
(॥ఎటు॥)
తరితీవులను ముంచి తమకము లింత నించి
సరి జాగులఁ బెట్టేవు చలమా నీకు
ఇరవై శ్రీవేంకటేశ యేలితి వీకె నింతలో
సరులు దిద్దేవు యిదె సఁదా(సందా?) నీకు
(||pallavi||)
ĕḍuvaṁṭivām̐ḍavayyā yemayyā nīvu
taḍugana nim̐ka dayadalam̐sugovayyā
(||ĕḍu||)
yĕḍamāḍa lāḍiṁchi iṁtidom̐ bŏṁdulu sesi
taḍavavu tām̐kavu tagavā nīgu
aḍiyālā lĕllām̐ jĕppi āsalāsalam̐ bĕṭṭi
vĕḍavĕḍagā navvevu veḍugā nīgu
(||ĕḍu||)
sannalu sārĕgum̐jesi savu lībĕgum̐ buṭṭiṁchi
pannuga jūjūlāḍevu paṁtamā nīgu
yĕnnigagām̐ bĕṁḍlāḍi ikkuvalu garam̐giṁchi
vunnām̐ḍa vĕṟam̐ganaṭṭe vusidamā nīgu
(||ĕḍu||)
taridīvulanu muṁchi tamagamu liṁta niṁchi
sari jāgulam̐ bĕṭṭevu salamā nīgu
iravai śhrīveṁkaḍeśha yelidi vīgĕ niṁtalo
sarulu diddevu yidĕ sam̐dā(saṁdā?) nīgu