Eduvamtivaamdavayya yimtigi vichcheyavayya

ఎటువంటివాఁడవయ్య యింటికి విచ్చేయవయ్య
Language

(॥పల్లవి॥)
ఎటువంటివాఁడవయ్య యింటికి విచ్చేయవయ్య
ఘటన నీ దేవులదే కాచుకున్న దిపుడు

(॥॥)
వలచి కాంతలు వడినట్టే తిట్టుదురు
మలసి కోపగింతురా మగవారు
పిలచితే నాఁడువారు బిగియక మానరు
అలుగుదురా నీకు అంతలోననే

(॥॥)
ఱట్టిడి సతులెల్ల నాఱడి సేఁతలు సేతురు
పట్టుదురా యెగ్గులెల్లాఁ బతులేఁదైనా
ముట్టితేఁ జుట్టిపువారు ముంజేవట్టి పెనఁగుదు-
రట్టే సాదింతురా చలమంతలోననే

(॥॥)
రతిలోనే వనితలు రాజసము చూపుదురు
తతిఁ బంతాలు గొందురా తమవిభులు
యితవై శ్రీవేంకటేశ యింతి నిట్టే కూడితివి
అతిబత్తి చూపుదురా అంతలోననే

(||pallavi||)
ĕḍuvaṁṭivām̐ḍavayya yiṁṭigi vichcheyavayya
ghaḍana nī devulade kāsugunna dibuḍu

(||||)
valasi kāṁtalu vaḍinaṭṭe tiṭṭuduru
malasi kobagiṁturā magavāru
pilaside nām̐ḍuvāru bigiyaga mānaru
alugudurā nīgu aṁtalonane

(||||)
ṟaṭṭiḍi sadulĕlla nāṟaḍi sem̐talu seduru
paṭṭudurā yĕggulĕllām̐ badulem̐dainā
muṭṭidem̐ juṭṭibuvāru muṁjevaṭṭi pĕnam̐gudu-
raṭṭe sādiṁturā salamaṁtalonane

(||||)
radilone vanidalu rājasamu sūbuduru
tadim̐ baṁtālu gŏṁdurā tamavibhulu
yidavai śhrīveṁkaḍeśha yiṁti niṭṭe kūḍidivi
adibatti sūbudurā aṁtalonane