ఎటువంటివాడవయ్యా యిచ్చకము సేయగాను
(॥పల్లవి॥)
ఎటువంటివాడవయ్యా యిచ్చకము సేయగాను
సటలంటా బొమ్మలను జంకింతురా
(॥॥)
వూరకే నీపాదములు వొత్తుచుఁ బిసుకఁ గాను
గోరుదాఁకెనంటా యేల కొచ్చి చూచేవు
చేరివూడిగాలు గడుఁ జేసితే మెచ్చుఁ గాక
నేరుపు నేరము లెంచి నిందవేతురా
(॥॥)
కన్న గన్న చోటనెల్లా గందము నీకుఁబూయఁగా
చన్నులు నా టెనంటా సాదించేవు
వున్నతి బ త్తిసేసితే నొడఁబడుదురుగాక
సన్నలఁ దప్పులు మోపి చండి సేతురా
(॥॥)
మొల్లమిరతుల నిన్ను మోవి యాని కూడఁగాను
పల్లు సోఁ కెనంటా నాతోఁ బంతమాడేవు
యిల్లిదె శ్రీ వెంకటేశ ఇందుకె నవ్వుట గాక
కొల్లగా సిగ్గువరచి కోసరుదురా
(||pallavi||)
ĕḍuvaṁṭivāḍavayyā yichchagamu seyagānu
saḍalaṁṭā bŏmmalanu jaṁkiṁturā
(||||)
vūrage nībādamulu vŏttusum̐ bisugam̐ gānu
gorudām̐kĕnaṁṭā yela kŏchchi sūsevu
serivūḍigālu gaḍum̐ jeside mĕchchum̐ gāga
nerubu neramu lĕṁchi niṁdavedurā
(||||)
kanna ganna soḍanĕllā gaṁdamu nīgum̐būyam̐gā
sannulu nā ṭĕnaṁṭā sādiṁchevu
vunnadi ba ttiseside nŏḍam̐baḍudurugāga
sannalam̐ dappulu mobi saṁḍi sedurā
(||||)
mŏllamiradula ninnu movi yāni kūḍam̐gānu
pallu som̐ kĕnaṁṭā nādom̐ baṁtamāḍevu
yillidĕ śhrī vĕṁkaḍeśha iṁdugĕ navvuḍa gāga
kŏllagā sigguvarasi kosarudurā