ఎటువంటివాడవయ్య యేమి చెప్పేది
(॥పల్లవి॥)
ఎటువంటివాడవయ్య యేమి చెప్పేది
కటకటా వలపు లంగడిఁ బెట్టఁదగునా
(॥ఎటు॥)
సేసతోఁ బెండ్లాడినాపె చేతులు చాఁచఁగవద్దా
ఆసలఁ బొరవినాపె అలయవద్దా
నీసుద్దులు వినినాపె నివ్వెరగు నొందవద్దా
యీ సతినేల సాదించే విందుకుఁగా నీవు
(॥ఎటు॥)
విన్నపాలు సేసేయాపె వేమారుఁ గొసరవద్దా
కన్నులారఁ గనినాపె కసరవద్దా
చన్నులు దాఁకినయాపె సరసము లాడవద్దా
కన్నె నేల జంకించేవు కాఁతాళాన నీవు
(॥ఎటు॥)
కూటమికి వచ్చినాపె గోర నెచ్చరించవద్దా
చోటు చేకొన్నాపె కూడి చొక్కవద్దా
నీటున శ్రీవేంకటేశ నీయాలట మొక్కవద్దా
మేటి కాంతనేల కదిమేవు పై పై నీవు
(||pallavi||)
ĕḍuvaṁṭivāḍavayya yemi sĕppedi
kaḍagaḍā valabu laṁgaḍim̐ bĕṭṭam̐dagunā
(||ĕḍu||)
sesadom̐ bĕṁḍlāḍinābĕ sedulu sām̐sam̐gavaddā
āsalam̐ bŏravinābĕ alayavaddā
nīsuddulu vininābĕ nivvĕragu nŏṁdavaddā
yī sadinela sādiṁche viṁdugum̐gā nīvu
(||ĕḍu||)
vinnabālu seseyābĕ vemārum̐ gŏsaravaddā
kannulāram̐ ganinābĕ kasaravaddā
sannulu dām̐kinayābĕ sarasamu lāḍavaddā
kannĕ nela jaṁkiṁchevu kām̐tāḽāna nīvu
(||ĕḍu||)
kūḍamigi vachchinābĕ gora nĕchchariṁchavaddā
soḍu segŏnnābĕ kūḍi sŏkkavaddā
nīḍuna śhrīveṁkaḍeśha nīyālaḍa mŏkkavaddā
meḍi kāṁtanela kadimevu pai pai nīvu