Eduvamtidaanave yeme neevu

ఎటువంటిదానవే యేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఎటువంటిదానవే యేమే నీవు
సటలు సేసే వాతఁడు చనవియ్యఁగాను

(॥ఎటు॥)
కన్నులనే సొలసేవు కాఁకలనే యలసేవు
మన్నించి యాతఁడు నీతో మాటలాడఁగా
సన్నలనే వొరసేవు సముకాన జరసేవు
మిన్నక, యప్పటిఁ దాను మించి నవ్వఁగాను

(॥ఎటు॥)
కూరిములు గొసరేవు కుంచెపట్టి విసరేవు
చేరి యాతఁడే నిన్ను జెనకఁగాను
నేరుపులు చూపేవు నెపములే మోపేవు
కోరి నీకు విడెము గక్కున నియ్యఁగాను

(॥ఎటు॥)
పంతములే యాడేవు పదములు పాడేవు
యింతలో శ్రీవేంకటేశుఁ డెనయఁగాను
సంతోసాలు నెరపేవు చవులెల్లాఁగరపేవు
బంతినే రతులు తాను పచారించఁగాను

(||pallavi||)
ĕḍuvaṁṭidānave yeme nīvu
saḍalu sese vādam̐ḍu sanaviyyam̐gānu

(||ĕḍu||)
kannulane sŏlasevu kām̐kalane yalasevu
manniṁchi yādam̐ḍu nīdo māḍalāḍam̐gā
sannalane vŏrasevu samugāna jarasevu
minnaga, yappaḍim̐ dānu miṁchi navvam̐gānu

(||ĕḍu||)
kūrimulu gŏsarevu kuṁchĕbaṭṭi visarevu
seri yādam̐ḍe ninnu jĕnagam̐gānu
nerubulu sūbevu nĕbamule mobevu
kori nīgu viḍĕmu gakkuna niyyam̐gānu

(||ĕḍu||)
paṁtamule yāḍevu padamulu pāḍevu
yiṁtalo śhrīveṁkaḍeśhum̐ ḍĕnayam̐gānu
saṁtosālu nĕrabevu savulĕllām̐garabevu
baṁtine radulu tānu pasāriṁcham̐gānu