ఎటువంటి యాఁటదైనా ఇంత కోపునా
(॥పల్లవి॥)
ఎటువంటి యాఁటదైనా ఇంత కోపునా
తటుకున నిది చూచి దయవుట్టె మాకును
(॥ఎటు॥)
వెలనుండి యాపె నీవేళలు గాచుకుండఁగా
చెలితో మాటలాడేవు చెల్లునా నీకు
సొలవక ఆపె నీసుద్దు లాలకించఁగాను
కిలకిల నవ్వే వీడ కేరడముగాదా
(॥ఎటు॥)
గాఁటముగా నాడ నాపె కానుకవట్టుకుండఁగా
పాటలు వినే విక్కడఁ బంతమా నీకు
సూటిగా నీరూపము సోరణగండ్లఁ జూడఁగా
జూటవై పరాకయ్యేవు సోద్యముగాదా
(॥ఎటు॥)
తలుపు దెఱచుకొని తానే వచ్చివుండఁగాను
చలనమునఁ జెనకేవు సంగతా నాకు
అలమె శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె
తలఁపెరిఁగి యేలేవు తగవేకాదా
(||pallavi||)
ĕḍuvaṁṭi yām̐ṭadainā iṁta kobunā
taḍuguna nidi sūsi dayavuṭṭĕ māgunu
(||ĕḍu||)
vĕlanuṁḍi yābĕ nīveḽalu gāsuguṁḍam̐gā
sĕlido māḍalāḍevu sĕllunā nīgu
sŏlavaga ābĕ nīsuddu lālagiṁcham̐gānu
kilagila navve vīḍa keraḍamugādā
(||ĕḍu||)
gām̐ṭamugā nāḍa nābĕ kānugavaṭṭuguṁḍam̐gā
pāḍalu vine vikkaḍam̐ baṁtamā nīgu
sūḍigā nīrūbamu soraṇagaṁḍlam̐ jūḍam̐gā
jūḍavai parāgayyevu sodyamugādā
(||ĕḍu||)
talubu dĕṟasugŏni tāne vachchivuṁḍam̐gānu
salanamunam̐ jĕnagevu saṁgadā nāgu
alamĕ śhrīveṁkaḍeśha alamelumaṁga yīgĕ
talam̐pĕrim̐gi yelevu tagavegādā