Eduvamti yaagadeemda vemi seppemu

ఎటువంటి యాగడీఁడ వేమి చెప్పేము
Language

(॥పల్లవి॥)
ఎటువంటి యాగడీఁడ వేమి చెప్పేము
సటలనే కాంతలను సాదించ నేర్చితివి

(॥ఎటు॥)
వచ్చి వచ్చి తొంగి చూచి వాడిక పొందులు సేసి
రచ్చలఁ బెట్టితివిగా రామవయసు
యెచ్చట నీతో నవ్విన దెటువంటియాఁటదైనా
గచ్చురేఁగి మిక్కిలి కాకరి గాకపోవునా

(॥ఎటు॥)
ఆయాలంటఁ గూచుండి యట్టె జూజులాడి
బాయట వేసితివిగా పడతిసిగ్గు
చాయల నీవున్న వూరసతి యెవ్వతె వుండినా
కాయజవిద్యలఁ గతకారి గాకపోవునా

(॥ఎటు॥)
పలుమారు విడే లిచ్చి పచ్చిమాఁటలాడి కూడి
కళలు రేఁచితివిగా కాంతనెవెమ్మోము
యెలమి శ్రీవేంకటేవ యేలితివి నన్ను నీకు
వలచిన దెప్పుడూ వెకలి గాకపోవునా

(||pallavi||)
ĕḍuvaṁṭi yāgaḍīm̐ḍa vemi sĕppemu
saḍalane kāṁtalanu sādiṁcha nersidivi

(||ĕḍu||)
vachchi vachchi tŏṁgi sūsi vāḍiga pŏṁdulu sesi
rachchalam̐ bĕṭṭidivigā rāmavayasu
yĕchchaḍa nīdo navvina dĕḍuvaṁṭiyām̐ṭadainā
gachchurem̐gi mikkili kāgari gāgabovunā

(||ĕḍu||)
āyālaṁṭam̐ gūsuṁḍi yaṭṭĕ jūjulāḍi
bāyaḍa vesidivigā paḍadisiggu
sāyala nīvunna vūrasadi yĕvvadĕ vuṁḍinā
kāyajavidyalam̐ gadagāri gāgabovunā

(||ĕḍu||)
palumāru viḍe lichchi pachchimām̐ṭalāḍi kūḍi
kaḽalu rem̐sidivigā kāṁtanĕvĕmmomu
yĕlami śhrīveṁkaḍeva yelidivi nannu nīgu
valasina dĕppuḍū vĕgali gāgabovunā