ఎటువంటి యాగడములు యీపె సుద్దులు
(॥పల్లవి॥)
ఎటువంటి యాగడములు యీపె సుద్దులు
కటకటా నీవే యిది గయ్యాళి యనవా
(॥ఎటు॥)
కమ్ముల సతులెల్లను కేరికేరి నవ్వఁగాను
తమ్ముల మొసంగేవు యీతరుణికిని
యెమ్మెలకు నీవీపెను యేమేమి సేసినాను
ఇమ్ముల సిగ్గువడని దేఁటియాఁటదనరా
(॥ఎటు॥)
చెంత నున్నవారెల్లా చెవులు మూసుకొనఁగ
యెంతపచ్చిమాట లాడే వీపెతోను
వింతసేసి నీ వెంతవేడుకకాఁడవై నాను
ఇంతేసి ఱట్టడియైతే నేంటియాం టదనరా
(॥ఎటు॥)
చేరి వూడిగపువారు శిరసులు వంచుకోఁగా
సారెఁ గాఁగిలించె వీసతిని నీవు
యీరీతి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
యేరా నన్నేలితి వాపె నేఁటి యాఁటదనరా
(||pallavi||)
ĕḍuvaṁṭi yāgaḍamulu yībĕ suddulu
kaḍagaḍā nīve yidi gayyāḽi yanavā
(||ĕḍu||)
kammula sadulĕllanu kerigeri navvam̐gānu
tammula mŏsaṁgevu yīdaruṇigini
yĕmmĕlagu nīvībĕnu yememi sesinānu
immula sigguvaḍani dem̐ṭiyām̐ṭadanarā
(||ĕḍu||)
sĕṁta nunnavārĕllā sĕvulu mūsugŏnam̐ga
yĕṁtabachchimāḍa lāḍe vībĕdonu
viṁtasesi nī vĕṁtaveḍugagām̐ḍavai nānu
iṁtesi ṟaṭṭaḍiyaide neṁṭiyāṁ ṭadanarā
(||ĕḍu||)
seri vūḍigabuvāru śhirasulu vaṁchugom̐gā
sārĕm̐ gām̐giliṁchĕ vīsadini nīvu
yīrīdi śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
yerā nannelidi vābĕ nem̐ṭi yām̐ṭadanarā