ఎటువంటి వోజ యీపె కెటువంటి వొడికము
(॥పల్లవి॥)
ఎటువంటి వోజ యీపె కెటువంటి వొడికము
కుటిలకుంతలి నీకే కోమలి గాఁదగును
(॥ఎటు॥)
మగువ నీవు రాఁగాను మంచముపై నుండి లేచి
నిగిడి చెక్కుచేతితో నిలుచున్నది
తగులమిసేసి నీవు దండఁ గూచుండుమనగా
పగటున మెల్లనె నీపాదా లొత్తీని
(॥ఎటు॥)
నీవు మోము చూచితేను నీచేతికి బాగాలిచ్చి
కావించి యాకుమడిచి కాచుకున్నది
ఆవేళ మోము చూచి అటు నీవు నవ్వితేను
పూవులు నీకు ముడిచీ బుజముమాటునను
(॥ఎటు॥)
పెనఁగులాడఁగా నిన్ను బెరసి కాఁగిట నించి
మునుపఁ దమ్ములానకు మోవి చాఁచీని
యెనసె శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
తనిసి నీరతులను దై లువారీని
(||pallavi||)
ĕḍuvaṁṭi voja yībĕ kĕḍuvaṁṭi vŏḍigamu
kuḍilaguṁtali nīge komali gām̐dagunu
(||ĕḍu||)
maguva nīvu rām̐gānu maṁchamubai nuṁḍi lesi
nigiḍi sĕkkusedido nilusunnadi
tagulamisesi nīvu daṁḍam̐ gūsuṁḍumanagā
pagaḍuna mĕllanĕ nībādā lŏttīni
(||ĕḍu||)
nīvu momu sūsidenu nīsedigi bāgālichchi
kāviṁchi yāgumaḍisi kāsugunnadi
āveḽa momu sūsi aḍu nīvu navvidenu
pūvulu nīgu muḍisī bujamumāḍunanu
(||ĕḍu||)
pĕnam̐gulāḍam̐gā ninnu bĕrasi kām̐giḍa niṁchi
munubam̐ dammulānagu movi sām̐sīni
yĕnasĕ śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
tanisi nīradulanu dai luvārīni