ఎటువంటి విలాసిని యెంతజాణ యీచెలువ
(॥పల్లవి॥)
ఎటువంటి విలాసిని యెంతజాణ యీచెలువ
తటుకన నీకు దక్కె దైవారఁ జూడవయ్యా
(॥ఎటు॥)
మగువ మాటాడితేను మాణికాలు నిండుకొని
పగడాలు పెదవులఁ బచ్చి దేరీని
మగడిచూచితేను మంచినీలా లుప్పతిలీ
తగు నీకు నీపెదిక్కు తప్పకచూడవయ్యా
(॥ఎటు॥)
పడఁతి జవ్వనమునఁ బచ్చలు గమ్ముకొనీని
నడచితే వైడూర్యాలు వెడలీగోళ్ళ
తొడిఁబడ నవ్వితేను తొరిగీని వజ్రాలు
వొడికమైనది యీపెవొరపు చూడవయ్యా
(॥ఎటు॥)
కొమ్మ ప్రియాలతేనేలఁ గురిసీఁ బుష్యరాగాలు
కుమ్మరించీఁ జెనకుల గోమేధికాలు
ముమ్మురపుఁజెమటట ముత్తెపుసరాలు నిండీ
నెమ్మది శ్రీవేంకటేశ నీదేవిఁ జూడవయ్యా
(||pallavi||)
ĕḍuvaṁṭi vilāsini yĕṁtajāṇa yīsĕluva
taḍugana nīgu dakkĕ daivāram̐ jūḍavayyā
(||ĕḍu||)
maguva māḍāḍidenu māṇigālu niṁḍugŏni
pagaḍālu pĕdavulam̐ bachchi derīni
magaḍisūsidenu maṁchinīlā luppadilī
tagu nīgu nībĕdikku tappagasūḍavayyā
(||ĕḍu||)
paḍam̐ti javvanamunam̐ bachchalu gammugŏnīni
naḍaside vaiḍūryālu vĕḍalīgoḽḽa
tŏḍim̐baḍa navvidenu tŏrigīni vajrālu
vŏḍigamainadi yībĕvŏrabu sūḍavayyā
(||ĕḍu||)
kŏmma priyāladenelam̐ gurisīm̐ buṣhyarāgālu
kummariṁchīm̐ jĕnagula gomedhigālu
mummurabum̐jĕmaḍaṭa muttĕbusarālu niṁḍī
nĕmmadi śhrīveṁkaḍeśha nīdevim̐ jūḍavayyā