ఎటువంటి వేగిరకాఁడీత డోయమ్మా
(॥పల్లవి॥)
ఎటువంటి వేగిరకాఁడీత డోయమ్మా
చిటుకంటే మిట్టిపడి సిగ్గువడీని
(॥ఎటు॥)
చెప్పక చెప్పినమాట చెవిలోనే వుండఁగాను
యిప్పుడు నామోము చూచి యోంత నవ్వీనే
చొప్పుగా నేఁజూచేచూపు సోఁకీసోఁకకతొల్లేఁ
తప్పించుక తా నెల్ల తడఁబడీనే
(॥ఎటు॥)
ముట్టక ముట్టినచేయి ముంజేతిపై నుండఁగాను
గట్టునఁజెమట లేల కుమ్మరించీనే
చిట్టినాసన్నలు తెలిసీఁదెలియకతొల్లే
బట్టబయ లానలేల పెట్టుకొనీనే
(॥ఎటు॥)
వొత్తకవొత్తినచున్ను లురమున నుండిఁగాను
బత్తిసేసి నాతో నేమి పచారించీనే
కొత్త శ్రీవేంకటేశుఁడు కూడీఁగూడకతొల్లే
హత్తి నన్ను నేలి యంత ఆదరించీనే
(||pallavi||)
ĕḍuvaṁṭi vegiragām̐ḍīda ḍoyammā
siḍugaṁṭe miṭṭibaḍi sigguvaḍīni
(||ĕḍu||)
sĕppaga sĕppinamāḍa sĕvilone vuṁḍam̐gānu
yippuḍu nāmomu sūsi yoṁta navvīne
sŏppugā nem̐jūsesūbu som̐kīsom̐kagadŏllem̐
tappiṁchuga tā nĕlla taḍam̐baḍīne
(||ĕḍu||)
muṭṭaga muṭṭinaseyi muṁjedibai nuṁḍam̐gānu
gaṭṭunam̐jĕmaḍa lela kummariṁchīne
siṭṭināsannalu tĕlisīm̐dĕliyagadŏlle
baṭṭabaya lānalela pĕṭṭugŏnīne
(||ĕḍu||)
vŏttagavŏttinasunnu luramuna nuṁḍim̐gānu
battisesi nādo nemi pasāriṁchīne
kŏtta śhrīveṁkaḍeśhum̐ḍu kūḍīm̐gūḍagadŏlle
hatti nannu neli yaṁta ādariṁchīne