ఎటువంటి వేడుకలో యెలమితో మాకివి
(॥పల్లవి॥)
ఎటువంటి వేడుకలో యెలమితో మాకివి
తటుకున మీ సుద్దులు తలచే రిందరును
(॥॥)
అందలముమీఁదనుండి అతివమోము చూచి
పందేలువేసుకొంటాఁ బలుమారును
సందడిఁ గొలిచివచ్చేసతులతో నవ్వుకొంటా
పొందుగ నీవేఁగిరాఁగాఁ బొగడే రిందరును
(॥॥)
మలఁగుపై నొరగుండి మాటలాడి దేవులతో
వలపులు చల్లుకొంటా వాడవాడల
లలి నూడిగపుకాంతలను సన్న సేసుకొంటా
పొలసి నీవేఁగిరాఁగాఁ బొగడే రిందరును
(॥॥)
అంకె పరపుపై నుండి ఆలమేల్మంగఁ బెండ్లాడి
లంకెలై శ్రీ వేంకటేశ లాలించుకొంటా
వుంకువ నాటపాటలవువిదల మెచ్చుకొంటా
పొంకమున నీవేఁగిరాఁగాఁ బొగడే రిందరును
(||pallavi||)
ĕḍuvaṁṭi veḍugalo yĕlamido māgivi
taḍuguna mī suddulu talase riṁdarunu
(||||)
aṁdalamumīm̐danuṁḍi adivamomu sūsi
paṁdeluvesugŏṁṭām̐ balumārunu
saṁdaḍim̐ gŏlisivachchesadulado navvugŏṁṭā
pŏṁduga nīvem̐girām̐gām̐ bŏgaḍe riṁdarunu
(||||)
malam̐gubai nŏraguṁḍi māḍalāḍi devulado
valabulu sallugŏṁṭā vāḍavāḍala
lali nūḍigabugāṁtalanu sanna sesugŏṁṭā
pŏlasi nīvem̐girām̐gām̐ bŏgaḍe riṁdarunu
(||||)
aṁkĕ parabubai nuṁḍi ālamelmaṁgam̐ bĕṁḍlāḍi
laṁkĕlai śhrī veṁkaḍeśha lāliṁchugŏṁṭā
vuṁkuva nāḍabāḍalavuvidala mĕchchugŏṁṭā
pŏṁkamuna nīvem̐girām̐gām̐ bŏgaḍe riṁdarunu