ఎటువంటి వేడుకలో ఇద్దరికి మీఁద మీఁద
(॥పల్లవి॥)
ఎటువంటి వేడుకలో ఇద్దరికి మీఁద మీఁద
ఘటన వెన్నెల పులుఁగము లాడేరదివో
(॥ఎటు॥)
చిత్తజునిఁ గన్నతల్లి సిగ్గువడు తానే పతి-
పొత్తునఁ గూచుండెఁ బెద్దబువ్వానను
యిత్తల నాయకుఁడును యెడమిచ్చి తొడఁదొడఁ
నొత్తుక కూచుండి మేను లొరసీనదివో
(॥ఎటు॥)
శిరసు వంచుకొని చిమ్ముఁజూపుతో నింతి
పురుషుఁ డిచ్చేకడి పుచ్చుకొనీ
సరసములాడుకొంటా చవిచెప్పుతా నతఁడు
సరిఁ గుజ్జాయపుమోవి సారె నిచ్చీనదివో
(॥ఎటు॥)
కప్పినకుచగిరులు కానరాఁగా మూసుకొంటా
నప్పటి దవ్వులకూర లందీఁ జెలి
అప్పుడే శ్రీవేంకటేశుఁ డాయాలకే చేచాఁచె
దెప్పరపుఁగందువలఁ దేలించె నదివో
(||pallavi||)
ĕḍuvaṁṭi veḍugalo iddarigi mīm̐da mīm̐da
ghaḍana vĕnnĕla pulum̐gamu lāḍeradivo
(||ĕḍu||)
sittajunim̐ gannadalli sigguvaḍu tāne padi-
pŏttunam̐ gūsuṁḍĕm̐ bĕddabuvvānanu
yittala nāyagum̐ḍunu yĕḍamichchi tŏḍam̐dŏḍam̐
nŏttuga kūsuṁḍi menu lŏrasīnadivo
(||ĕḍu||)
śhirasu vaṁchugŏni simmum̐jūbudo niṁti
puruṣhum̐ ḍichchegaḍi puchchugŏnī
sarasamulāḍugŏṁṭā savisĕppudā nadam̐ḍu
sarim̐ gujjāyabumovi sārĕ nichchīnadivo
(||ĕḍu||)
kappinagusagirulu kānarām̐gā mūsugŏṁṭā
nappaḍi davvulagūra laṁdīm̐ jĕli
appuḍe śhrīveṁkaḍeśhum̐ ḍāyālage sesām̐sĕ
dĕpparabum̐gaṁduvalam̐ deliṁchĕ nadivo