Eduvamti valabulo yiddarigini

ఎటువంటి వలపులో యిద్దరికిని
Language

(॥పల్లవి॥)
ఎటువంటి వలపులో యిద్దరికిని
చిటుకంటే మెచ్చేవు శ్రీనరసింహా

(॥॥)
గిరులెక్కి లకిమమ్మ కిన్నెర వాయించుకొంటా
పరగ నీమోము తప్పక చూడఁగా
సరుగన నీవు వచ్చి సంగడినే కూచుండి
సిరులతోఁ బొగడేవు శ్రీనరసింహా

(॥॥)
యెదురుమేడపై నెక్కి యెలుఁగెత్తి పాడిపాడి
వుదుటునఁ దామరపూవుల వేయఁగా
పొదిగి నీవంతలోనే బుజముపైఁ జేయివేసి
చెదరక చెక్కంటేవు శ్రీ నరసింహా

(॥॥)
పఱపుపై నీకె నీపై పరాకునఁ జెలితోడ
అఱిముఱి నిన్నుఁ జూపేకాంత మాడఁగా
మెఱయ శ్రీవేంకటాద్రిమీఁద వచ్చి కూడితివి
చెఱఁగువట్టి చొక్కుతా శ్రీనరసింహా

(||pallavi||)
ĕḍuvaṁṭi valabulo yiddarigini
siḍugaṁṭe mĕchchevu śhrīnarasiṁhā

(||||)
girulĕkki lagimamma kinnĕra vāyiṁchugŏṁṭā
paraga nīmomu tappaga sūḍam̐gā
sarugana nīvu vachchi saṁgaḍine kūsuṁḍi
siruladom̐ bŏgaḍevu śhrīnarasiṁhā

(||||)
yĕdurumeḍabai nĕkki yĕlum̐gĕtti pāḍibāḍi
vuduḍunam̐ dāmarabūvula veyam̐gā
pŏdigi nīvaṁtalone bujamubaim̐ jeyivesi
sĕdaraga sĕkkaṁṭevu śhrī narasiṁhā

(||||)
paṟabubai nīgĕ nībai parāgunam̐ jĕlidoḍa
aṟimuṟi ninnum̐ jūbegāṁta māḍam̐gā
mĕṟaya śhrīveṁkaḍādrimīm̐da vachchi kūḍidivi
sĕṟam̐guvaṭṭi sŏkkudā śhrīnarasiṁhā