ఎటువంటి వలపులో యెంతభాగ్యమో
(॥పల్లవి॥)
ఎటువంటి వలపులో యెంతభాగ్యమో
యిటువంటి సరసత లిద్దరికిఁ దగును
(॥ఎటు॥)
సరిసకి బేసికి నాడేసరసపుమీమాటలఁ
గురిసీని తేనెలు గుబగుబను
మరలిమరలిచూచేమచ్చికమీచూపులఁ
దొరలీని వెన్నెలలు తోడఁదోడవే
(॥ఎటు॥)
సన్నలఁ జాయలఁజల్లేసముకపుమీనవ్వుల
మిన్నక కప్రాలు చిందీ మీఁదమీఁదను
తన్నుఁదానే గుబ్బతిలేతనియనిమీసిగ్గుల
దిన్నలై చూపట్టీ ముత్తెపురాసులు
(॥ఎటు॥)
చలిమిబలిమిఁ గూడేజంటలమీచెనకుల
కొలఁదిమీర జారీఁగుంకుమరసాలు
కలసిన మీచుట్టరికములు శ్రీవేంకటేశ
తలకొనీ వేడుకల తరితీపులు
(||pallavi||)
ĕḍuvaṁṭi valabulo yĕṁtabhāgyamo
yiḍuvaṁṭi sarasada liddarigim̐ dagunu
(||ĕḍu||)
sarisagi besigi nāḍesarasabumīmāḍalam̐
gurisīni tenĕlu gubagubanu
maralimaralisūsemachchigamīsūbulam̐
dŏralīni vĕnnĕlalu toḍam̐doḍave
(||ĕḍu||)
sannalam̐ jāyalam̐jallesamugabumīnavvula
minnaga kaprālu siṁdī mīm̐damīm̐danu
tannum̐dāne gubbadiledaniyanimīsiggula
dinnalai sūbaṭṭī muttĕburāsulu
(||ĕḍu||)
salimibalimim̐ gūḍejaṁṭalamīsĕnagula
kŏlam̐dimīra jārīm̐guṁkumarasālu
kalasina mīsuṭṭarigamulu śhrīveṁkaḍeśha
talagŏnī veḍugala taridībulu