ఎటువంటి వలపో యెవ్వరికొలఁది గాదు
(॥పల్లవి॥)
ఎటువంటి వలపో యెవ్వరికొలఁది గాదు
ఘటనతోఁ దమకించీఁ గనుఁగొనవయ్యా
(॥॥)
తళుకున నిన్నుఁ జూచి తలవంచుకొని యింతి
తలపోసీ నీరూపు తనలోననె
నిలువుఁ జెమటతోడ నిట్టూరుపులతోడ
చెలరేఁగి గుబ్బతిలీఁ జిత్తగించవయ్యా
(॥॥)
కోరి నీవై నాసపడి గొబ్బునను సిగ్గువడి
పేరఁబెట్టి మాటలాడీఁ బెదవులనె
సారపుతురుముతోడ జవ్వనభారముతోడ
ఆరీతి నివ్వెరగందీ నాదరించవయ్యా
(॥॥)
కాఁగిటికిఁ జెయ్యి చాఁచి కన్నులనే నీకు మొక్కి
మాఁగినమోవి యిచ్చీ మతకాననె
చేఁగదేర నిన్నుఁ గూడె శ్రీ వేంకటేశుఁడ
వీఁగ దలమేలుమంగ వినోదించవయ్యా
(||pallavi||)
ĕḍuvaṁṭi valabo yĕvvarigŏlam̐di gādu
ghaḍanadom̐ damagiṁchīm̐ ganum̐gŏnavayyā
(||||)
taḽuguna ninnum̐ jūsi talavaṁchugŏni yiṁti
talabosī nīrūbu tanalonanĕ
niluvum̐ jĕmaḍadoḍa niṭṭūrubuladoḍa
sĕlarem̐gi gubbadilīm̐ jittagiṁchavayyā
(||||)
kori nīvai nāsabaḍi gŏbbunanu sigguvaḍi
peram̐bĕṭṭi māḍalāḍīm̐ bĕdavulanĕ
sārabudurumudoḍa javvanabhāramudoḍa
ārīdi nivvĕragaṁdī nādariṁchavayyā
(||||)
kām̐giḍigim̐ jĕyyi sām̐si kannulane nīgu mŏkki
mām̐ginamovi yichchī madagānanĕ
sem̐gadera ninnum̐ gūḍĕ śhrī veṁkaḍeśhum̐ḍa
vīm̐ga dalamelumaṁga vinodiṁchavayyā