Eduvamti valabo yemi seyamgalado

ఎటువంటి వలపో యేమి సేయఁగలదో
Language

(॥పల్లవి॥)
ఎటువంటి వలపో యేమి సేయఁగలదో
కుటిలపుఁ దనలోని గుణమెల్లాఁ గరఁగె

(॥ఎటు॥)
కలికి దనవిభునికడ కేఁగె వేగిరాన
తిలకము కస్తూరి తిద్దమఱచె
మలసి యాతనితోనే మాటాడేతమకాన
నిలువునఁ దనచేతినిమ్మపండు వదలె

(॥ఎటు॥)
సొగిసి చక్కనిరూపు చూచె పరాకున
మొగి వీడినతురుము ముడువదాయ
జిగిమించ నతనితోఁ జేరి నవ్వె సందడిని
తగఁ జెలియిచ్చినకై దండయును విడిచె

(॥ఎటు॥)
కందువశ్రీవేంకటేశుఁ గాఁగిలించే వేడుకను
అందపుఁబులకపువ్వులందు మునిగెఁ
చిందేటిమోవితేనే చేకొనేటిదప్పితోడ
పందెమాడి తనతో నీవంతమెల్లా నొసఁగె

(||pallavi||)
ĕḍuvaṁṭi valabo yemi seyam̐galado
kuḍilabum̐ danaloni guṇamĕllām̐ garam̐gĕ

(||ĕḍu||)
kaligi danavibhunigaḍa kem̐gĕ vegirāna
tilagamu kastūri tiddamaṟasĕ
malasi yādanidone māḍāḍedamagāna
niluvunam̐ danasedinimmabaṁḍu vadalĕ

(||ĕḍu||)
sŏgisi sakkanirūbu sūsĕ parāguna
mŏgi vīḍinadurumu muḍuvadāya
jigimiṁcha nadanidom̐ jeri navvĕ saṁdaḍini
tagam̐ jĕliyichchinagai daṁḍayunu viḍisĕ

(||ĕḍu||)
kaṁduvaśhrīveṁkaḍeśhum̐ gām̐giliṁche veḍuganu
aṁdabum̐bulagabuvvulaṁdu munigĕm̐
siṁdeḍimovidene segŏneḍidappidoḍa
paṁdĕmāḍi tanado nīvaṁtamĕllā nŏsam̐gĕ