Eduvamti vaamdavayyaa idemayya

ఎటువంటి వాఁడవయ్యా ఇదేమయ్య
Language

(॥పల్లవి॥)
ఎటువంటి వాఁడవయ్యా ఇదేమయ్య
ఘటనల నన్నేల గయ్యాళిఁ జేసేవు

(॥ఎటు॥)
కోరి ఇంటిలోనినన్ను కొలువులోనికిఁ బిల్చి
సారె ఇందరిలో సరసములాడేవు
వూరకే గుట్టుతోడనుండే నాచన్నులమీఁద
జీరలుగా గోర గీరి సిగ్గు విడిపించేవు

(॥ఎటు॥)
వూడగముసేసేనన్ను వొగిఁ దొడపై నిడుక
తోడుతోడ నీ విట్టే దొరకఁ జేసేవు
వాడినమోవితోడుత వంచిన నాశిర సెత్తి
యీడుజోడు లెంచ కిట్టె యెంగిలిసేసేవు

(॥ఎటు॥)
మానాపతియైననన్ను మరి పెండ్లిచవికలో
కానిమ్మనిసేసవెట్టి కాఁగిలించేవు
యీనయమున శ్రీవేంకటేశ నన్ను నేలితివి
పూని ఇట్టె మన్నించి భోగించేవు

(||pallavi||)
ĕḍuvaṁṭi vām̐ḍavayyā idemayya
ghaḍanala nannela gayyāḽim̐ jesevu

(||ĕḍu||)
kori iṁṭiloninannu kŏluvulonigim̐ bilsi
sārĕ iṁdarilo sarasamulāḍevu
vūrage guṭṭudoḍanuṁḍe nāsannulamīm̐da
jīralugā gora gīri siggu viḍibiṁchevu

(||ĕḍu||)
vūḍagamusesenannu vŏgim̐ dŏḍabai niḍuga
toḍudoḍa nī viṭṭe dŏragam̐ jesevu
vāḍinamovidoḍuda vaṁchina nāśhira sĕtti
yīḍujoḍu lĕṁcha kiṭṭĕ yĕṁgilisesevu

(||ĕḍu||)
mānābadiyainanannu mari pĕṁḍlisavigalo
kānimmanisesavĕṭṭi kām̐giliṁchevu
yīnayamuna śhrīveṁkaḍeśha nannu nelidivi
pūni iṭṭĕ manniṁchi bhogiṁchevu