Eduvamti tamagamo yeduda nallade soodu

ఎటువంటి తమకమో యెదుట నల్లదె చూడు
Language

(॥పల్లవి॥)
ఎటువంటి తమకమో యెదుట నల్లదె చూడు
యిటు నీచిత్తముకొలఁ దిఁకనేమి యంపునో

(॥ఎటు॥)
కాంత నిన్నుఁబిలువ నీకడకు నన్నంపి యట్టే
కాంతుఁడ నీపేర లేకలూనంపె
దొంతిగా నావెంటనె తొంగలిచూపులునంపె
యింతట విచ్చేయకున్న యిఁకయేమి యంపునో

(॥ఎటు॥)
కామిని నాచేత నీకుఁ గానికంపె తోడనే
మైమరచి యీడకుఁ దా మనసూనంప
కోమలపుమాఁటల కోవిలయెలుగులంపె
యేమిట విచ్చేయకున్న నిఁకనేమి యంపునో

(॥ఎటు॥)
ఉంగరమానవాలంపె వువిద వాయువేగాన
అంగపు నిట్టుర్పుగాలి అదివో అంపె
తంగక శ్రీ వెంకటేశ తన నడపులు నంపె
యింగితాన నిదెకూడె యిఁకనేమి యంపునో

(||pallavi||)
ĕḍuvaṁṭi tamagamo yĕduḍa nalladĕ sūḍu
yiḍu nīsittamugŏlam̐ dim̐kanemi yaṁpuno

(||ĕḍu||)
kāṁta ninnum̐biluva nīgaḍagu nannaṁpi yaṭṭe
kāṁtum̐ḍa nībera legalūnaṁpĕ
dŏṁtigā nāvĕṁṭanĕ tŏṁgalisūbulunaṁpĕ
yiṁtaḍa vichcheyagunna yim̐kayemi yaṁpuno

(||ĕḍu||)
kāmini nāseda nīgum̐ gānigaṁpĕ toḍane
maimarasi yīḍagum̐ dā manasūnaṁpa
komalabumām̐ṭala kovilayĕlugulaṁpĕ
yemiḍa vichcheyagunna nim̐kanemi yaṁpuno

(||ĕḍu||)
uṁgaramānavālaṁpĕ vuvida vāyuvegāna
aṁgabu niṭṭurbugāli adivo aṁpĕ
taṁgaga śhrī vĕṁkaḍeśha tana naḍabulu naṁpĕ
yiṁgidāna nidĕgūḍĕ yim̐kanemi yaṁpuno