ఎటువంటి తగవరి వేమోయి నీవు
(॥పల్లవి॥)
ఎటువంటి తగవరి వేమోయి నీవు
ఇటువంటి వాఁడవా యేమోయి నీవు
(॥ఎటు॥)
మారుకొని యాపె సారె మాటలెల్ల నాడఁగాను
వూరకుండుమనేవు యేమోయి నన్ను
చేరియాపె కమ్మటిని చేతులు చాఁచఁగాను
యీరీతి నన్నే పట్టేవు ఇదేమోయి నీవు
(॥ఎటు॥)
వుదుటున రేఁగి యాపె వొట్టులెల్లాఁ బెట్టఁగాను
ఇదె నా కడ్డాలు వచ్చే వేమోయి నీవు
పదరి యాపె పూవుబంతిఁ గొనివేయఁగాను
యెదిగి నీమే నొడ్డే వేమోయి నీవు
(॥ఎటు॥)
పన్ని యాపె నా మీఁద పంతమెల్లాఁ జూపఁగాను
ఇన్ని నీపైఁ దీసుకొనే వేమోయి నీవు
వన్నెలశ్రీవేంకటేశ వాకిట నాపె వుండఁగా
యెన్న నన్ను లోనఁ గూడె వేమోయి నీవు
(||pallavi||)
ĕḍuvaṁṭi tagavari vemoyi nīvu
iḍuvaṁṭi vām̐ḍavā yemoyi nīvu
(||ĕḍu||)
mārugŏni yābĕ sārĕ māḍalĕlla nāḍam̐gānu
vūraguṁḍumanevu yemoyi nannu
seriyābĕ kammaḍini sedulu sām̐sam̐gānu
yīrīdi nanne paṭṭevu idemoyi nīvu
(||ĕḍu||)
vuduḍuna rem̐gi yābĕ vŏṭṭulĕllām̐ bĕṭṭam̐gānu
idĕ nā kaḍḍālu vachche vemoyi nīvu
padari yābĕ pūvubaṁtim̐ gŏniveyam̐gānu
yĕdigi nīme nŏḍḍe vemoyi nīvu
(||ĕḍu||)
panni yābĕ nā mīm̐da paṁtamĕllām̐ jūbam̐gānu
inni nībaim̐ dīsugŏne vemoyi nīvu
vannĕlaśhrīveṁkaḍeśha vāgiḍa nābĕ vuṁḍam̐gā
yĕnna nannu lonam̐ gūḍĕ vemoyi nīvu