Eduvamti suttame naa kemta kalasinavaamde

ఎటువంటి చుట్టమే నా కెంత కలసినవాఁడే
Language

(॥పల్లవి॥)
ఎటువంటి చుట్టమే నా కెంత కలసినవాఁడే
నటలు సేసీ వీని చంద మేమి చందమే

(॥ఎటు॥)
అలుక సేసుక నేనే అవ్వలిమో మై యుండఁగ
పిలిచీ నూరక నన్నుఁ బేరుకొని
పలుక కుండఁగఁ దానె పకపక నవ్వుకొంటా
నిటుచున్నాఁ డిదె వీనినేరు పేమి నేరుపే

(॥ఎటు॥)
ముడిపడ్డ బొమలతో ములుగుతా నుండఁగాను
తడవీ నూరక నన్నుఁ దతి గొని
చిడుముడితో నుండగఁ జేతులు చాఁచుకొంటా
వొడివట్టి నన్నుఁ దీసీ వోరు పేఁటి వోరుపే

(॥ఎటు॥)
పట్టినచలముతో నేఁ బవళించి వుండఁ గాను
వొట్టుక దగ్గరి నామై వొళ్లు వేసీని
అట్టె శ్రీవెంకట్టతి అలమేలుమంగ నేను
తిట్టఁగానె కూడె వీనితెగు వేఁటి తెగువే

(||pallavi||)
ĕḍuvaṁṭi suṭṭame nā kĕṁta kalasinavām̐ḍe
naḍalu sesī vīni saṁda memi saṁdame

(||ĕḍu||)
aluga sesuga nene avvalimo mai yuṁḍam̐ga
pilisī nūraga nannum̐ berugŏni
paluga kuṁḍam̐gam̐ dānĕ pagabaga navvugŏṁṭā
niḍusunnām̐ ḍidĕ vīnineru pemi nerube

(||ĕḍu||)
muḍibaḍḍa bŏmalado mulugudā nuṁḍam̐gānu
taḍavī nūraga nannum̐ dadi gŏni
siḍumuḍido nuṁḍagam̐ jedulu sām̐sugŏṁṭā
vŏḍivaṭṭi nannum̐ dīsī voru pem̐ṭi vorube

(||ĕḍu||)
paṭṭinasalamudo nem̐ bavaḽiṁchi vuṁḍam̐ gānu
vŏṭṭuga daggari nāmai vŏḽlu vesīni
aṭṭĕ śhrīvĕṁkaṭṭadi alamelumaṁga nenu
tiṭṭam̐gānĕ kūḍĕ vīnidĕgu vem̐ṭi tĕguve