Eduvamti rasigumdu yemani samtosimtu

ఎటువంటి రసికుఁడు యేమని సంతోసింతు
Language

(॥పల్లవి॥)
ఎటువంటి రసికుఁడు యేమని సంతోసింతు
తటుకన నా వలపు తానే పించెను???

(॥ఎటు॥)
కూరిమితోఁ దనమంచిగుణాలే చెప్పకోఁగాను
తారుకాణై మాయింటికి తానే విచ్చేసి
గారవించి తా మన్నించే కతలే తలఁచగాను
చేరి వేఁడుకొని చెక్కనొక్కె నిపుడు

(॥ఎటు॥)
ఆముకొని తనమాఁట లాలకించుకుండఁగాను
ప్రేమతోడఁ దానే నన్నుఁ బిలిచినాఁడు
గోమున సరసయాడఁగోరుక నేనుండఁగాను
చేముట్టి నాతోఁ బెనఁగి చిమ్మిరేఁడె నన్నును

(॥ఎటు॥)
నెమ్మిఁ దనకాఁగిటికి నే గాఁచుకుండఁగాను
వుమమడి నాచన్నులు మేనొత్తుకొనెను
నమ్మితే మనసుకు మనసే సాకిరిగాఁబోలు
ఇమ్ముల శ్రీ వేంకటేశుఁ డిన్నిటా నన్నేలెను

(||pallavi||)
ĕḍuvaṁṭi rasigum̐ḍu yemani saṁtosiṁtu
taḍugana nā valabu tāne piṁchĕnu???

(||ĕḍu||)
kūrimidom̐ danamaṁchiguṇāle sĕppagom̐gānu
tārugāṇai māyiṁṭigi tāne vichchesi
gāraviṁchi tā manniṁche kadale talam̐sagānu
seri vem̐ḍugŏni sĕkkanŏkkĕ nibuḍu

(||ĕḍu||)
āmugŏni tanamām̐ṭa lālagiṁchuguṁḍam̐gānu
premadoḍam̐ dāne nannum̐ bilisinām̐ḍu
gomuna sarasayāḍam̐goruga nenuṁḍam̐gānu
semuṭṭi nādom̐ bĕnam̐gi simmirem̐ḍĕ nannunu

(||ĕḍu||)
nĕmmim̐ danagām̐giḍigi ne gām̐suguṁḍam̐gānu
vumamaḍi nāsannulu menŏttugŏnĕnu
nammide manasugu manase sāgirigām̐bolu
immula śhrī veṁkaḍeśhum̐ ḍinniḍā nannelĕnu