Eduvamti raadigumde yee seliyadi

ఎటువంటి రాతిగుండె యీ చెలియది
Language

(॥పల్లవి॥)
ఎటువంటి రాతిగుండె యీ చెలియది
ఇటులా బుద్దిచెప్పినా నెంతైన గరఁగదు

(॥ఎటు॥)
మగవాని నెంతకైనా మట్టుపెట్టుకొనవచ్చు
మగువల చలములు మానుపరాదు
నగుతానే పంతగాని నయానకుఁ దేవచ్చు
జగడగత్తెను మరి చాయకుఁ దేరాదు

(॥ఎటు॥)
జూటరిపతిఁ జొక్కించి చుట్టముఁ జేసుకోవచ్చు
ఆఁటదానికోపము అణఁచరాదు
నీటున నుద్దండీని నేమానకుఁ దేవచ్చు
మేటిమొక్కళపుదాని మెప్పించరాదు

(॥ఎటు॥)
శ్రీవేంకటేశ్వరునిఁ. జెనకి కూడఁగవచ్చు
భావించి సవతి నొడఁబరచరాదు
యీవేళ నన్నేలె నీతఁ డీతనితో నవ్వవచ్చు
కావిరి గర్వపు కాంతఁ గరఁగించరాదు

(||pallavi||)
ĕḍuvaṁṭi rādiguṁḍĕ yī sĕliyadi
iḍulā buddisĕppinā nĕṁtaina garam̐gadu

(||ĕḍu||)
magavāni nĕṁtagainā maṭṭubĕṭṭugŏnavachchu
maguvala salamulu mānubarādu
nagudāne paṁtagāni nayānagum̐ devachchu
jagaḍagattĕnu mari sāyagum̐ derādu

(||ĕḍu||)
jūḍaribadim̐ jŏkkiṁchi suṭṭamum̐ jesugovachchu
ām̐ṭadānigobamu aṇam̐sarādu
nīḍuna nuddaṁḍīni nemānagum̐ devachchu
meḍimŏkkaḽabudāni mĕppiṁcharādu

(||ĕḍu||)
śhrīveṁkaḍeśhvarunim̐. jĕnagi kūḍam̐gavachchu
bhāviṁchi savadi nŏḍam̐barasarādu
yīveḽa nannelĕ nīdam̐ ḍīdanido navvavachchu
kāviri garvabu kāṁtam̐ garam̐giṁcharādu