Eduvamti pomdulo meegiddarigini

ఎటువంటి పొందులో మీకిద్దరికిని
Language

(॥పల్లవి॥)
ఎటువంటి పొందులో మీకిద్దరికిని
తటుకన నీలోనే తలఁచుకోవయ్యా

(॥ఎటు॥)
పట్టెఁడేసిగుబ్బల పడతి మొక్కితిననె
నెట్టన బంగారువంటినీపాదాలకు
మట్టున నీతోడుత మాటలాడి రమ్మనె
యిట్టె మారుత్తరము లేమని చేప్పేవయ్యా

(॥ఎటు॥)
చేరఁడేసికన్నులచెలి యడిగితిననె
చేరి నీ పరిణామపుచేఁతలెల్లాను
వేరుసేయ కిట్టె నీవేళ చూచి రమ్మనె
నేరుపు మాపెతోడుత లేలేమందునయ్యా

(॥ఎటు॥)
కాఁగెఁడేసిపిఱుదులకాంత వలచితిననె
వీఁగక నీవుగూడిన వేడుకలను
కాఁగిటిలో నిన్నూ దన్నూ గలపుదవు రమ్మనె
యేగివచ్చి శ్రీ వేంకటేశ కూడితివయ్యా

(||pallavi||)
ĕḍuvaṁṭi pŏṁdulo mīgiddarigini
taḍugana nīlone talam̐sugovayyā

(||ĕḍu||)
paṭṭĕm̐ḍesigubbala paḍadi mŏkkidinanĕ
nĕṭṭana baṁgāruvaṁṭinībādālagu
maṭṭuna nīdoḍuda māḍalāḍi rammanĕ
yiṭṭĕ māruttaramu lemani seppevayyā

(||ĕḍu||)
seram̐ḍesigannulasĕli yaḍigidinanĕ
seri nī pariṇāmabusem̐talĕllānu
veruseya kiṭṭĕ nīveḽa sūsi rammanĕ
nerubu mābĕdoḍuda lelemaṁdunayyā

(||ĕḍu||)
kām̐gĕm̐ḍesibiṟudulagāṁta valasidinanĕ
vīm̐gaga nīvugūḍina veḍugalanu
kām̐giḍilo ninnū dannū galabudavu rammanĕ
yegivachchi śhrī veṁkaḍeśha kūḍidivayyā