ఎటువంటి పరాకో యెరఁగలేవైతివి
(॥పల్లవి॥)
ఎటువంటి పరాకో యెరఁగలేవైతివి
తటుకన నిప్పు డిట్టె తలవంచుకొనేవు
(॥ఎటు॥)
అండను న్నాపెఁ జూడక ఆవల వేరొకాపెను
కొండసేసి సారెసారెఁ గొనియాడేవు
దండిగా నది విని యీతరుణి జంకింతేను
వెండియు నీమోము వెలవెలఁజేసుకొనేవు
(॥ఎటు॥)
పాదాలొత్తే ఆపెను భావించక మరపున
మోదించి వేరోకాపెను ముద్దాడేవు
ఆదెస నది చూచి నిన్నాకె యెరిఁగుంకొంటే
కాదనఁ జాలక నీవు కడు సిగ్గుపడేవు
(॥ఎటు॥)
అలమేలుమంగ వురమందు నీకు నుండఁగానే
కెలసి భూకాంతఁ గాఁగిట నించేవు
అలరి శ్రీవేంకటేశ అందుకిట్టె నవ్వితేను
లలి నిద్దరితోను మేలములాడేవు
(||pallavi||)
ĕḍuvaṁṭi parāgo yĕram̐galevaidivi
taḍugana nippu ḍiṭṭĕ talavaṁchugŏnevu
(||ĕḍu||)
aṁḍanu nnābĕm̐ jūḍaga āvala verŏgābĕnu
kŏṁḍasesi sārĕsārĕm̐ gŏniyāḍevu
daṁḍigā nadi vini yīdaruṇi jaṁkiṁtenu
vĕṁḍiyu nīmomu vĕlavĕlam̐jesugŏnevu
(||ĕḍu||)
pādālŏtte ābĕnu bhāviṁchaga marabuna
modiṁchi verogābĕnu muddāḍevu
ādĕsa nadi sūsi ninnāgĕ yĕrim̐guṁkŏṁṭe
kādanam̐ jālaga nīvu kaḍu siggubaḍevu
(||ĕḍu||)
alamelumaṁga vuramaṁdu nīgu nuṁḍam̐gāne
kĕlasi bhūgāṁtam̐ gām̐giḍa niṁchevu
alari śhrīveṁkaḍeśha aṁdugiṭṭĕ navvidenu
lali niddaridonu melamulāḍevu