Eduvamti nee maaya yeramgamuraa

ఎటువంటి నీ మాయ యెరఁగమురా
Language

(॥పల్లవి॥)
ఎటువంటి నీ మాయ యెరఁగమురా
యిటువంటి చేఁతలనే యెడ్డ నైతిరా

(॥ఎటువంటి॥)
నగఁ బోతే నీ చేతి నాలికి లో నయితిమి
అగ డాయ మావలపు లట్టే వుండరా
మొగము చూడఁగఁ బోతే ముంచుకొనె మోహ మెల్ల
యగసక్కెములకే యేమి సేతురా

(॥ఎటువంటి॥)
మాఁట లాడఁ బోయి నీతో మంతనాలఁ జిక్కితిమి
యేఁటికి మమ్ముఁ జెనకే వేడ సుద్దిరా
మేఁటినిన్న మెచ్చఁ బోయి మేనవాని చుట్టుకొంటే
యేఁట వెట్టీఁ దమకము యేమి సేతురా

(॥ఎటువంటి॥)
కరఁగించఁ బోయి నీ కాఁగిట నేఁ గూడితి
యిర వాయ వయసు నవ్విఁక నేలరా
సరవి శ్రీవెంకటేశ సమ్మటూరిలో మనము
యెరవు లేని యీమేలు కేమి సేతురా

(||pallavi||)
ĕḍuvaṁṭi nī māya yĕram̐gamurā
yiḍuvaṁṭi sem̐talane yĕḍḍa naidirā

(||ĕḍuvaṁṭi||)
nagam̐ bode nī sedi nāligi lo nayidimi
aga ḍāya māvalabu laṭṭe vuṁḍarā
mŏgamu sūḍam̐gam̐ bode muṁchugŏnĕ moha mĕlla
yagasakkĕmulage yemi sedurā

(||ĕḍuvaṁṭi||)
mām̐ṭa lāḍam̐ boyi nīdo maṁtanālam̐ jikkidimi
yem̐ṭigi mammum̐ jĕnage veḍa suddirā
mem̐ṭininna mĕchcham̐ boyi menavāni suṭṭugŏṁṭe
yem̐ṭa vĕṭṭīm̐ damagamu yemi sedurā

(||ĕḍuvaṁṭi||)
karam̐giṁcham̐ boyi nī kām̐giḍa nem̐ gūḍidi
yira vāya vayasu navvim̐ka nelarā
saravi śhrīvĕṁkaḍeśha sammaḍūrilo manamu
yĕravu leni yīmelu kemi sedurā