ఎటువంటి మోహములో యిద్దరికిని
(॥పల్లవి॥)
ఎటువంటి మోహములో యిద్దరికిని
కటకటా మిమ్ముఁ జూచి కరఁగె నా మనసు
(॥ఎటు॥)
చెక్కుమీఁదఁ జేయి వెట్టి సిగ్గులెల్లఁ బెడరేఁచి
మక్కువ నెవ్వతో నీతో మాటలాడెను
ముక్కుమీఁద వేలు మోపి ముసిముసినవ్వునవ్వి
నిక్కి చూచె నేమిటికో నిన్ను నపుడు
(॥ఎటు॥)
జలజలఁ జెమరించి చక్కనిమోము వంచి
సొలయుచు పైఁ జల్లె వలపు నీపై
తెలిగన్ను లరమోడ్చి తెగనియాసలు చూపి
కొలువులో సన్న సేసి కోసరె నిన్నతివ
(॥ఎటు॥)
సేసవెట్టి పెండ్లాడి చెలిమి నీతోఁ జేసి
వూసెను గందము నీమైఁ బొఁగ నాపె
బాసిచ్చి నన్నేలితివి పక్కన శ్రీవేంకటేశ
యీసుద్దులకె తాను యిచ్చకము సేసెను
(||pallavi||)
ĕḍuvaṁṭi mohamulo yiddarigini
kaḍagaḍā mimmum̐ jūsi karam̐gĕ nā manasu
(||ĕḍu||)
sĕkkumīm̐dam̐ jeyi vĕṭṭi siggulĕllam̐ bĕḍarem̐si
makkuva nĕvvado nīdo māḍalāḍĕnu
mukkumīm̐da velu mobi musimusinavvunavvi
nikki sūsĕ nemiḍigo ninnu nabuḍu
(||ĕḍu||)
jalajalam̐ jĕmariṁchi sakkanimomu vaṁchi
sŏlayusu paim̐ jallĕ valabu nībai
tĕligannu laramoḍchi tĕganiyāsalu sūbi
kŏluvulo sanna sesi kosarĕ ninnadiva
(||ĕḍu||)
sesavĕṭṭi pĕṁḍlāḍi sĕlimi nīdom̐ jesi
vūsĕnu gaṁdamu nīmaim̐ bŏm̐ga nābĕ
bāsichchi nannelidivi pakkana śhrīveṁkaḍeśha
yīsuddulagĕ tānu yichchagamu sesĕnu