ఎటువంటి మోహమో యింతిపై నీకు
(॥పల్లవి॥)
ఎటువంటి మోహమో యింతిపై నీకు
విటరాయతనమున వినోదించేవూ
(॥ఎటువంటి॥)
చెక్కుటద్దములనీడ చేరి నీవు చూచుకొంటా
తక్కక యాకెతో నేకతము లాడేవు
ముక్కునను తియ్యని మోవితావి గోలుకొంటా
మక్కువలు చల్లి చల్లి మాట లాడించేవూ
(॥ఎటువంటి॥)
పొదితో నునుఁజన్నులు బుజము లొరసుకొంటా
కైదండ వట్టుకొని దగ్గరఁ దీసేవు
ఆదిగొని మెల్లనే మాట లాలకించుకొంటా
సాదించి చేయి చాఁచి సరసము చూపేవు
(॥ఎటువంటి॥)
కందువనుండి బిగ్గెఁ గౌఁగిలించుకొంటా
చందముగా రతులనే సాము సేసేవు
పందెము వేసుకొంటా పక్కన శ్రీవేంకటేశ
మందలించి పానుపుపై మన్నించేవూ
(||pallavi||)
ĕḍuvaṁṭi mohamo yiṁtibai nīgu
viḍarāyadanamuna vinodiṁchevū
(||ĕḍuvaṁṭi||)
sĕkkuḍaddamulanīḍa seri nīvu sūsugŏṁṭā
takkaga yāgĕdo negadamu lāḍevu
mukkunanu tiyyani movidāvi golugŏṁṭā
makkuvalu salli salli māḍa lāḍiṁchevū
(||ĕḍuvaṁṭi||)
pŏdido nunum̐jannulu bujamu lŏrasugŏṁṭā
kaidaṁḍa vaṭṭugŏni daggaram̐ dīsevu
ādigŏni mĕllane māḍa lālagiṁchugŏṁṭā
sādiṁchi seyi sām̐si sarasamu sūbevu
(||ĕḍuvaṁṭi||)
kaṁduvanuṁḍi biggĕm̐ gaum̐giliṁchugŏṁṭā
saṁdamugā radulane sāmu sesevu
paṁdĕmu vesugŏṁṭā pakkana śhrīveṁkaḍeśha
maṁdaliṁchi pānububai manniṁchevū