ఎటువంటి మోహమో యింతి నీపై నతనికి
(॥పల్లవి॥)
ఎటువంటి మోహమో యింతి నీపై నతనికి
తటుకన నురమున ధరియించె నిన్నును
(॥ఎటు॥)
కామిని నీ నడపులు గజగమనము లని
కామించి నీ పతి కరిఁ గాచెను
కోమలపు నీ పిరుఁదు చక్రభావ మని
నేమమై చక్రము చేత నిలిపినాఁ డతఁడు
(॥ఎటు॥)
నెలఁత నీ నిలయము నీరజ మనుచుఁ బ్రియ
మలరి జలజనాభుఁ డాయ నతఁడు
కలికి నీ గళము శంఖముఁ బోలునని తాఁ
దలఁచి పాంచజన్యధరుఁ డాయ నతఁడు
(॥ఎటు॥)
నిరతి నలమేల్మంగ నీ కురులు నలు పని
అరుదార నీలవర్ణుఁ డాయ నతఁడు
గిరికుచవని నిన్నుఁ గెరలి కౌఁగిటఁ గూడె
పరగ శ్రీ వేంకటపతి యాయ నతఁడు
(||pallavi||)
ĕḍuvaṁṭi mohamo yiṁti nībai nadanigi
taḍugana nuramuna dhariyiṁchĕ ninnunu
(||ĕḍu||)
kāmini nī naḍabulu gajagamanamu lani
kāmiṁchi nī padi karim̐ gāsĕnu
komalabu nī pirum̐du sakrabhāva mani
nemamai sakramu seda nilibinām̐ ḍadam̐ḍu
(||ĕḍu||)
nĕlam̐ta nī nilayamu nīraja manusum̐ briya
malari jalajanābhum̐ ḍāya nadam̐ḍu
kaligi nī gaḽamu śhaṁkhamum̐ bolunani tām̐
dalam̐si pāṁchajanyadharum̐ ḍāya nadam̐ḍu
(||ĕḍu||)
niradi nalamelmaṁga nī kurulu nalu pani
arudāra nīlavarṇum̐ ḍāya nadam̐ḍu
girigusavani ninnum̐ gĕrali kaum̐giḍam̐ gūḍĕ
paraga śhrī veṁkaḍabadi yāya nadam̐ḍu