ఎటువంటి మర్మములో ఇంతికి నీకు
(॥పల్లవి॥)
ఎటువంటి మర్మములో ఇంతికి నీకు
తటుకున నడిగినఁ దలఁపేమీఁ జెప్పదు
(॥॥)
పొంతనున్న చేలిమీఁదఁ బొరలి పొరలి నవ్వీ
మంతానాన నీవాడినమాటఁ దలఁ చి
దొంతిపులకలు రేఁగఁ దోడతోడ వెరగందీ
చెంత నీవు సేసినట్టిచేసన్నలు దలఁచి
(॥॥)
సొలసి ముంజేతిచిల్కఁ జూచి సిగ్గువడీ
బలిమి నీవిచ్చినబాసలు దలఁచి
నిలువెల్లాఁ జెమరించ నిట్టూర్పు నిగుడించీ
మలసి మన్నించినమన్ననలు దలఁచి
(॥॥)
కమ్మవిరిపాన్పుపై కరఁగి కరఁగి చొక్కీ
చిమ్ముల నీవుసేసినచేఁతఁ దలఁచి
నెమ్మది శ్రీ వేంకటేశ నిన్నుఁ గూడి మొక్కు మొక్కీ
కమ్మిననీరతులలో కందువలు దలఁ చి
(||pallavi||)
ĕḍuvaṁṭi marmamulo iṁtigi nīgu
taḍuguna naḍiginam̐ dalam̐pemīm̐ jĕppadu
(||||)
pŏṁtanunna selimīm̐dam̐ bŏrali pŏrali navvī
maṁtānāna nīvāḍinamāḍam̐ dalam̐ si
dŏṁtibulagalu rem̐gam̐ doḍadoḍa vĕragaṁdī
sĕṁta nīvu sesinaṭṭisesannalu dalam̐si
(||||)
sŏlasi muṁjedisilgam̐ jūsi sigguvaḍī
balimi nīvichchinabāsalu dalam̐si
niluvĕllām̐ jĕmariṁcha niṭṭūrbu niguḍiṁchī
malasi manniṁchinamannanalu dalam̐si
(||||)
kammaviribānpubai karam̐gi karam̐gi sŏkkī
simmula nīvusesinasem̐tam̐ dalam̐si
nĕmmadi śhrī veṁkaḍeśha ninnum̐ gūḍi mŏkku mŏkkī
kamminanīradulalo kaṁduvalu dalam̐ si