Eduvamti machchigalo yiddarigini

ఎటువంటి మచ్చికలో యిద్దరికిని
Language

(॥పల్లవి॥)
ఎటువంటి మచ్చికలో యిద్దరికిని
జొటజొట మోవితేనె జొబ్బిలి నీ కిపుడు

(॥ఎటు॥)
పల్లకిమీఁదటనుండి పడతి చనుమొనలు
వొల్లనే బొటనవేల నొత్తితివి
మొల్లమి నందుల కాపె మోము దప్పక చూచితే
జల్లన మైఁ బులకలు జాజుకొనె నిపుడు

(॥ఎటు॥)
రవ్వగా గుఱ్ఱము నెక్కి రాజసాన నీపాదము
జవ్వని వొడిలోపలఁ జాఁచితివి
వువ్విళ్లూర నాపె నిన్ను వొయ్యనే జంకించితేను
నివ్వటిల్ల నీ చెక్కుల నిండెను చెమటలు

(॥ఎటు॥)
మేడమీద నెక్కుతాను మెడమీఁదఁ జేయి వెసి
వేడుకతోఁ గూడితివి వెలఁదిని
యీడుతో శ్రీవేంకటేశ యిందు కాపె నవ్వితేను
జాడతో నిట్టూర్పులు చల్లితివి రతులా

(||pallavi||)
ĕḍuvaṁṭi machchigalo yiddarigini
jŏḍajŏḍa movidenĕ jŏbbili nī kibuḍu

(||ĕḍu||)
pallagimīm̐daḍanuṁḍi paḍadi sanumŏnalu
vŏllane bŏḍanavela nŏttidivi
mŏllami naṁdula kābĕ momu dappaga sūside
jallana maim̐ bulagalu jājugŏnĕ nibuḍu

(||ĕḍu||)
ravvagā guṭramu nĕkki rājasāna nībādamu
javvani vŏḍilobalam̐ jām̐sidivi
vuvviḽlūra nābĕ ninnu vŏyyane jaṁkiṁchidenu
nivvaḍilla nī sĕkkula niṁḍĕnu sĕmaḍalu

(||ĕḍu||)
meḍamīda nĕkkudānu mĕḍamīm̐dam̐ jeyi vĕsi
veḍugadom̐ gūḍidivi vĕlam̐dini
yīḍudo śhrīveṁkaḍeśha yiṁdu kābĕ navvidenu
jāḍado niṭṭūrbulu sallidivi radulā