ఎటువంటి మచ్చికలో యెట్టి తరితీపులో
(॥పల్లవి॥)
ఎటువంటి మచ్చికలో యెట్టి తరితీపులో
చిటుకన నే వినేను చెవుల పండుగలు
(॥ఎటు॥)
చెలరేఁగి యాపె నీకుఁ జెప్పె నిందాఁకా సుద్దులు
వెలలేనివేడుకతో వింటివి నీవు
తలఁపునఁబట్టెనా తమి నీకుఁ బుట్టెనా
అలరి యాసంతోషము లానతియ్యవయ్యా
(॥ఎటు॥)
పలుమారు నీయెదుటఁ బాడె నాపె పాటలు
తలయూఁచి మెచ్చితివి దానికి నీవు
కలిగెనా నీకు మేలు కలఁగెనా నీకు గుండె
యెలుఁగెత్తి నాకుఁగొంత యెరిఁగించవయ్య
(॥ఎటు॥)
యెలమి నీతో నామె యేకతములెల్లా నాడె
వలపులు చల్లితివి వద్దనుండి
నిలిచి శ్రీవేంకటేశ నే నల మేల్మంగను
కలసితి వెచ్చరించు కలవెల్లా నాకును
(||pallavi||)
ĕḍuvaṁṭi machchigalo yĕṭṭi taridībulo
siḍugana ne vinenu sĕvula paṁḍugalu
(||ĕḍu||)
sĕlarem̐gi yābĕ nīgum̐ jĕppĕ niṁdām̐kā suddulu
vĕlaleniveḍugado viṁṭivi nīvu
talam̐punam̐baṭṭĕnā tami nīgum̐ buṭṭĕnā
alari yāsaṁtoṣhamu lānadiyyavayyā
(||ĕḍu||)
palumāru nīyĕduḍam̐ bāḍĕ nābĕ pāḍalu
talayūm̐si mĕchchidivi dānigi nīvu
kaligĕnā nīgu melu kalam̐gĕnā nīgu guṁḍĕ
yĕlum̐gĕtti nāgum̐gŏṁta yĕrim̐giṁchavayya
(||ĕḍu||)
yĕlami nīdo nāmĕ yegadamulĕllā nāḍĕ
valabulu sallidivi vaddanuṁḍi
nilisi śhrīveṁkaḍeśha ne nala melmaṁganu
kalasidi vĕchchariṁchu kalavĕllā nāgunu