Eduvamti koorimulu yeduvamti muchchadalu

ఎటువంటి కూరిములు యెటువంటి ముచ్చటలు
Language

(॥పల్లవి॥)
ఎటువంటి కూరిములు యెటువంటి ముచ్చటలు
ఇటువంటివెల్లా మీకు నిద్దరికే తగును

(॥ఎటు॥)
నీవు పరాకైవుండఁగా నిమ్మపంటఁ గొని వేసి
మోవి చూపె నాకె నీపై మోహ మెట్టిదో
వోవరిలోఁ బవ్వళించి వున్న నిన్ను లేపి నీకు
వేవేగను విడె మిచ్చె వేడుక యదెట్టిదో

(॥ఎటు॥)
కొలువులో నీవుండఁగా కొనగోర నిన్ను నూఁది
పిలిచె రతికేలికిఁ బ్రియ మెట్టిదో
నలిరేఁగి మరపుతో నాటకసాల చూడఁగా
పలుకుఁ గప్పుర మిచ్చె బత్తి యెట్టిదో

(॥ఎటు॥)
కూడి చొక్కివుండఁగాను గుబ్బచన్నుల ని న్నొత్తి
యీడుగా నవ్వులు నవ్వె ఇంపు లెట్టివో
జోడై శ్రీవేంకటేశ సుదతి నిన్ను మెప్పించె
యీడనే యిన్ని చందాల ఇత వెట్టిదో

(||pallavi||)
ĕḍuvaṁṭi kūrimulu yĕḍuvaṁṭi muchchaḍalu
iḍuvaṁṭivĕllā mīgu niddarige tagunu

(||ĕḍu||)
nīvu parāgaivuṁḍam̐gā nimmabaṁṭam̐ gŏni vesi
movi sūbĕ nāgĕ nībai moha mĕṭṭido
vovarilom̐ bavvaḽiṁchi vunna ninnu lebi nīgu
veveganu viḍĕ michchĕ veḍuga yadĕṭṭido

(||ĕḍu||)
kŏluvulo nīvuṁḍam̐gā kŏnagora ninnu nūm̐di
pilisĕ radigeligim̐ briya mĕṭṭido
nalirem̐gi marabudo nāḍagasāla sūḍam̐gā
palugum̐ gappura michchĕ batti yĕṭṭido

(||ĕḍu||)
kūḍi sŏkkivuṁḍam̐gānu gubbasannula ni nnŏtti
yīḍugā navvulu navvĕ iṁpu lĕṭṭivo
joḍai śhrīveṁkaḍeśha sudadi ninnu mĕppiṁchĕ
yīḍane yinni saṁdāla ida vĕṭṭido