ఎటువంటి జాణవు నిన్నేమనేది
(॥పల్లవి॥)
ఎటువంటి జాణవు నిన్నేమనేది
తటుకన నిందు కెంత తమకించే విపుడు
(॥ఎటు॥)
కందువ నాపె నీవుఁ గాఁపురాలు సేయఁగాను
సందడి సరసమాడ సంగతా నాకు
విందువెట్టి ఆపె నీకు విడెము చేతికియ్యఁగా
నందుకొని నేను నీకు నాకుమడిచిత్తునా
(॥ఎటు॥)
వువ్విళ్లూర నీవు నాపె వొక్క పాన్పుపై నుండఁగా
చివ్వన వలపు చల్లఁ జెల్లునా నాకు
నివ్వటిల్లఁ బొంచి యాపె నీమోము చూడఁగాను
నవ్వులు నవ్వుదునా నడుమ నేను
(॥ఎటు॥)
రట్టుగా నాపె నీవు ఇట్టె రతిసేయఁగాను
వెట్టి కూడిగాలు సేయ వేడుకా నాకు
ఇట్టె శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
చుట్టమ నయినమీఁద చొప్పలెత్తనేఁటికి
(||pallavi||)
ĕḍuvaṁṭi jāṇavu ninnemanedi
taḍugana niṁdu kĕṁta tamagiṁche vibuḍu
(||ĕḍu||)
kaṁduva nābĕ nīvum̐ gām̐purālu seyam̐gānu
saṁdaḍi sarasamāḍa saṁgadā nāgu
viṁduvĕṭṭi ābĕ nīgu viḍĕmu sedigiyyam̐gā
naṁdugŏni nenu nīgu nāgumaḍisittunā
(||ĕḍu||)
vuvviḽlūra nīvu nābĕ vŏkka pānpubai nuṁḍam̐gā
sivvana valabu sallam̐ jĕllunā nāgu
nivvaḍillam̐ bŏṁchi yābĕ nīmomu sūḍam̐gānu
navvulu navvudunā naḍuma nenu
(||ĕḍu||)
raṭṭugā nābĕ nīvu iṭṭĕ radiseyam̐gānu
vĕṭṭi kūḍigālu seya veḍugā nāgu
iṭṭĕ śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
suṭṭama nayinamīm̐da sŏppalĕttanem̐ṭigi