Eduvamti jaanavaidi vidivo neevu

ఎటువంటి జాణవైతి విదివో నీవు
Language

(॥పల్లవి॥)
ఎటువంటి జాణవైతి విదివో నీవు
తటుకన నవ్వి నవ్వి తనియ వాసోదమా

(॥ఎటు॥)
అంగవించి నాచేత నందరూ వినఁగాను
వెంగెము లాడించుకొను వేడుకా నీకు
కొంగువట్టితియ్యఁగాను కోపగించి నే నిన్ను
జంగిలితిట్టు దిట్టితే సంతోసమా నీకు

(॥ఎటు॥)
వెనుకొని నీకొప్పువీడినందాకా నాచే
పెనఁగులాడించుకొను ప్రియమా నీకు
కొనగోరు సోఁకి నీమై కుమ్మెలు నాటఁగా
చెనకించుకొన నంత సింగారమా నీకు

(॥ఎటు॥)
దిట్టవై నాచేతను తేనెగా రేనీమోవి
ఇట్టె గంటిసేయించుకో యితవా ను
గట్టిగా శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
గుట్టుతోడ నింతసేయఁ గోరికా నీకు

(||pallavi||)
ĕḍuvaṁṭi jāṇavaidi vidivo nīvu
taḍugana navvi navvi taniya vāsodamā

(||ĕḍu||)
aṁgaviṁchi nāseda naṁdarū vinam̐gānu
vĕṁgĕmu lāḍiṁchugŏnu veḍugā nīgu
kŏṁguvaṭṭidiyyam̐gānu kobagiṁchi ne ninnu
jaṁgilidiṭṭu diṭṭide saṁtosamā nīgu

(||ĕḍu||)
vĕnugŏni nīgŏppuvīḍinaṁdāgā nāse
pĕnam̐gulāḍiṁchugŏnu priyamā nīgu
kŏnagoru som̐ki nīmai kummĕlu nāḍam̐gā
sĕnagiṁchugŏna naṁta siṁgāramā nīgu

(||ĕḍu||)
diṭṭavai nāsedanu tenĕgā renīmovi
iṭṭĕ gaṁṭiseyiṁchugo yidavā nu
gaṭṭigā śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
guṭṭudoḍa niṁtaseyam̐ gorigā nīgu