(॥పల్లవి॥)
ఎటువంటి జాణకాఁడే యీతఁడు
చిటుకలు వేసీని సెలవి నవ్వులను
(॥ఎటు॥)
సంగడినున్నయాపెను సాకిరి చెప్పుమనుచు
కొంగువట్టి తీసీని కొయ్యతనాన
అంగవించి మాటలాడ ననువుగావలె నంటా
నెంగిలితమ్ములము పైనిట్టె వుమిసీని
(॥ఎటు॥)
యెఱుకగాఁ బొరుగాపె నిట్టే పొద్దు చెప్పుమని
నెఱిఁగొప్పువట్టి తీసీ నేరుపునను
మఱియుఁ బెనఁగేవేళ మైమరువు వలెనంటా
మెఱుఁగుగోణము కొంగు మీఁదవేసీని
(॥ఎటు॥)
పోరచి వచ్చినాపెను బుద్దులు చెప్పుమనుచు
గోరగీరి కాఁగిలించి కూడీనదే
యీరీతి శ్రీవేంకటేశుఁ డిరవై వుండేనంటా
సారెకు మన్నించి నాకు చనవిచ్చీనే
(||pallavi||)
ĕḍuvaṁṭi jāṇagām̐ḍe yīdam̐ḍu
siḍugalu vesīni sĕlavi navvulanu
(||ĕḍu||)
saṁgaḍinunnayābĕnu sāgiri sĕppumanusu
kŏṁguvaṭṭi tīsīni kŏyyadanāna
aṁgaviṁchi māḍalāḍa nanuvugāvalĕ naṁṭā
nĕṁgilidammulamu painiṭṭĕ vumisīni
(||ĕḍu||)
yĕṟugagām̐ bŏrugābĕ niṭṭe pŏddu sĕppumani
nĕṟim̐gŏppuvaṭṭi tīsī nerubunanu
maṟiyum̐ bĕnam̐geveḽa maimaruvu valĕnaṁṭā
mĕṟum̐gugoṇamu kŏṁgu mīm̐davesīni
(||ĕḍu||)
porasi vachchinābĕnu buddulu sĕppumanusu
goragīri kām̐giliṁchi kūḍīnade
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍiravai vuṁḍenaṁṭā
sārĕgu manniṁchi nāgu sanavichchīne