Eduvamti jaanadana midi melayyaa

ఎటువంటి జాణతన మిది మేలయ్యా
Language

(॥పల్లవి॥)
ఎటువంటి జాణతన మిది మేలయ్యా
మట(టు?)మాయ చేఁతలనే మచ్చిక చూపేవు

(॥॥)
తేరకొనఁ జూచితేనే దిష్టిదాఁకెనంటాను
కోరి కొంగువట్టేవు కొమ్మను నీవు
మేరతో నవ్వుకొంటేను మీఁదఁజల్లె వలపంటా
గోరవంటి చెక్కునొక్కి గురుతు సేసేవు

(॥॥)
సంగడికి వచ్చితేనే చన్నులు దాఁకించెనంటా
యెంగిలి సేసేవు మోవి ఇంతలో నీవు
చెంగట మాటాడితేనే చిత్తము గరఁచెనంటా
కెంగేల సంగములు గిలిగించేవు

(॥॥)
ఆకుమడిచిచ్చితేనే ఆసలు రేఁచెనంటా
కైకొని నీపచ్చడము గప్పేవు నీవు
యీకడ శ్రీవేంకటేశ యింతి నిట్టె యేలితివి
దీకొని మొక్కితే నీకు దేవులంటా మెచ్చేవు

(||pallavi||)
ĕḍuvaṁṭi jāṇadana midi melayyā
maḍa(ṭu?)māya sem̐talane machchiga sūbevu

(||||)
teragŏnam̐ jūsidene diṣhṭidām̐kĕnaṁṭānu
kori kŏṁguvaṭṭevu kŏmmanu nīvu
merado navvugŏṁṭenu mīm̐dam̐jallĕ valabaṁṭā
goravaṁṭi sĕkkunŏkki gurudu sesevu

(||||)
saṁgaḍigi vachchidene sannulu dām̐kiṁchĕnaṁṭā
yĕṁgili sesevu movi iṁtalo nīvu
sĕṁgaḍa māḍāḍidene sittamu garam̐sĕnaṁṭā
kĕṁgela saṁgamulu giligiṁchevu

(||||)
āgumaḍisichchidene āsalu rem̐sĕnaṁṭā
kaigŏni nībachchaḍamu gappevu nīvu
yīgaḍa śhrīveṁkaḍeśha yiṁti niṭṭĕ yelidivi
dīgŏni mŏkkide nīgu devulaṁṭā mĕchchevu